వరుణ్ తేజ్ గర్ల్‌ఫ్రెండ్‌ ఫొటో రివీల్: మాయ చేయడానికి సిద్ధమైన బాలీవుడ్ బ్యూటీ

నాగబాబు కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్ సహా ఎన్నో విభాగాల్లో సత్తా చాటుతూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. 'ముకుందా'తో హీరోగా వచ్చిన అతడు.. ఆ వెంటనే జాతీయ అవార్డును అందుకున్న 'కంచె' మూవీతో నేషనల్ లెవెల్‌లో గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇలా ఆరంభంలోనే తన మార్కును చూపించి క్రమంగా స్టార్‌గా ఎదిగిపోయాడు. ఆ తర్వాత కూడా పలు విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే వరుణ్ తేజ్ వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

కొంత కాలంగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు వరుణ్ తేజ్. దీంతో మరింత జోష్‌తో ఎన్నో ప్రాజెక్టులను సైతం పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు ప్రస్తుతం 'గని' అనే సినిమాలో నటిస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంతో రూపొందుతోంది. మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. కానీ, అనివార్య కారణాల వల్ల తరచూ ఆటంకాలు ఎదురవడంతో చిత్రీకరణ మాత్రం చాలా ఆలస్యం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే క్లైమాక్స్‌కు సంబంధించిన ఫైనల్ షెడ్యూల్‌ను పూర్తి చేయడంతో పాటు డబ్బింగ్ వర్క్ కూడా మొదలు పెట్టారు.

Saiee Manjrekar Ghani Movie First Look Released

బాక్సింగ్ నేపథ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'గని' చిత్రాన్ని వీలైనంత త్వరగా ప్రేక్షఖుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ అనుకుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది దీపావళి పండుగ కానుకగా నవంబర్ 4వ తేదీన విడుదల చేయాలని భావించింది. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా చేసింది. అయితే, అనుకున్న సమయానికి షూట్ పూర్తి కాని కారణంగా దీన్ని డిసెంబర్‌కు వాయిదా వేస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల 'గని' మూవీ యూనిట్ ఫస్ట్ పంచ్ పేరిట ఓ గ్లిమ్స్ వీడియోను విడుదల చేసింది. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

'గని' సినిమా నుంచి నవంబర్ 15న టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో నటించిన నటీనటులకు సంబంధించిన పాత్రలు.. ఆయా ఫస్ట్ లుక్ పోస్టర్లను ఒక్కొక్కటిగా వదులుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వరుణ్ తేజ్, నదియా, జగపతిబాబు, నవీన్ చంద్రల పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ హీరోయిన్ సయీ మంజ్రేకర్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. ఇందులో ఆమె పాత్ర పేరు మాయ అని వెల్లడించారు.

క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న 'గని' సినిమాలో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం చాలా కాలం పాటు అమెరికాలో బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక, ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర కూడా హీరోకు పోటీనిచ్చే బాక్సర్‌గా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీళ్లతో పాటు సునీల్ శెట్టి, కన్నడ హీరో ఉపేంద్ర కూడా కీలక పాత్రలను చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X