బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దేవీ శ్రీ ప్రసాద్: అరుదైన రికార్డును పట్టేశాడుగా
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా.. దక్షిణాదికి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా తెరకెక్కించిన చిత్రం 'రాధే: ద మోస్ట్ వాంటెడ్ భాయ్'. ముంబైలోని డ్రగ్స్ మాఫియా నేపథ్యంతో రాబోతున్న ఈ సినిమాలో సల్లూ భాయ్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా నటిస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకూ దీని నుంచి విడుదలైన వాటికి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ మరో రికార్డును కూడా బద్దలు కొట్టేసింది.
సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'రాధే' నుంచి ఇటీవల 'సీటీమార్' అనే వీడియో సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ - పూజా హెగ్డే జంటగా నటించిన 'డీజే.. దువ్వాడ జగన్నాథమ్' సినిమాలోని సీటీమార్.. సీటీమార్ అనే పాటనే దేవీ శ్రీ ప్రసాద్ ఇందులో రీమిక్స్ చేశాడు. ఈ పాటలో సల్మాన్ ఖాన్‌తో హాట్ బ్యూటీ దిశా పటానీ డ్యాన్స్ చేసింది. ఇక, ఈ పాటకు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ అవుతోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే వంద మిలియన్ల మార్కును చేరుకుంది. తద్వారా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ బాలీవుడ్‌లో అరుదైన ఘనతను అందుకున్నట్లైంది.

ఇదిలా ఉండగా.. కొరియన్ సినిమా 'ద ఔట్ లాస్'కు 'రాధే' రీమేక్‌గా వస్తోంది. ఈ మూవీ మే 13న విడుదల చేయాలని భావించారు. కానీ, అది సాధ్యం అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఇక, ఈ మూవీని సల్మాన్, అతుల్ అగ్నిహోత్రి, సోహైల్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో మేఘా ఆకాశ్, దిశాపటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రణ్ దీప్ హుడా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు.


Click it and Unblock the Notifications











