twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో పాటతో వచ్చిన సల్మాన్ ఖాన్.. ఆకట్టుకుంటోన్న ‘రాధే’ మూవీ టైటిల్ ట్రాక్

    |

    బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా.. ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వం వహించిన చిత్రం 'రాధే: ద మోస్ట్ వాంటెడ్ భాయ్'. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను ఎప్పుడో ప్రారంభించారు. అయితే, అనివార్య కారణాల వల్ల పలుమార్లు షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఇక, ఈ మధ్యనే అన్ని ఆటంకాలనూ దాటుకుని విడుదలకు సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా పాటలను ఒక్కక్కటిగా వదులుతోంది చిత్ర యూనిట్.

    'రాధే' మూవీ నుంచి ఇటీవలే 'సిటీమార్' సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. దీనికి బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి ఊహిచని రీతిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ పాటకు యూట్యూబ్‌లో భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఇక, తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుంచి టైటిల్ ట్రాక్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు లిరిక్స్, ట్యూన్ కంపోజింగ్ అందించడంతో పాటు ఆలపించాడు షాజీద్ వజీద్. ఎంతో స్టైలిష్‌గా సాగుతోన్న ఈ టైటిల్ ట్రాక్‌ కూడా అదరగొట్టేస్తుంది. మరీ ముఖ్యంగా ఇందులో సల్మాన్ ఖాన్ ఎలివేషన్, పిక్చరైజేషన్, డ్యాన్స్ మూమెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయనే చెప్పాలి.

    Salman Khans Radhe Title Track Song Released

    'వాంటెడ్', 'దబాంగ్ 3' వంటి హిట్ల తర్వాత సల్మాన్ ఖాన్ - ప్రభుదేవా కాంబినేషన్‌లో రాబోతున్న 'రాధే'పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని డ్రగ్స్ మాఫియా నేపథ్యంతో రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ సినిమాలో మేఘా ఆకాశ్‌, దిశాప‌టానీ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ర‌ణ్ దీప్ హుడా, జాకీ ష్రాఫ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని స‌ల్మాన్‌ ఖాన్‌, అతుల్ అగ్నిహోత్రి, సోహైల్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు. ఇది మే 13న విడుదల కాబోతుంది.

    English summary
    Radhe: Your Most Wanted Bhai is an upcoming Indian action film directed by Prabhu Deva and produced by Salman Khan, Sohail Khan and Atul Agnihotri. The film stars Salman Khan, Megha Akash Disha Patani, Randeep Hooda and Jackie Shroff.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X