Don't Miss!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
మరో పాటతో వచ్చిన సల్మాన్ ఖాన్.. ఆకట్టుకుంటోన్న ‘రాధే’ మూవీ టైటిల్ ట్రాక్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా.. ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వం వహించిన చిత్రం 'రాధే: ద మోస్ట్ వాంటెడ్ భాయ్'. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాను ఎప్పుడో ప్రారంభించారు. అయితే, అనివార్య కారణాల వల్ల పలుమార్లు షూటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఇక, ఈ మధ్యనే అన్ని ఆటంకాలనూ దాటుకుని విడుదలకు సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా పాటలను ఒక్కక్కటిగా వదులుతోంది చిత్ర యూనిట్.
'రాధే' మూవీ నుంచి ఇటీవలే 'సిటీమార్' సాంగ్ విడుదలైన విషయం తెలిసిందే. దీనికి బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి ఊహిచని రీతిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ పాటకు యూట్యూబ్‌లో భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఇక, తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుంచి టైటిల్ ట్రాక్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు లిరిక్స్, ట్యూన్ కంపోజింగ్ అందించడంతో పాటు ఆలపించాడు షాజీద్ వజీద్. ఎంతో స్టైలిష్‌గా సాగుతోన్న ఈ టైటిల్ ట్రాక్ కూడా అదరగొట్టేస్తుంది. మరీ ముఖ్యంగా ఇందులో సల్మాన్ ఖాన్ ఎలివేషన్, పిక్చరైజేషన్, డ్యాన్స్ మూమెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయనే చెప్పాలి.
'వాంటెడ్', 'దబాంగ్ 3' వంటి హిట్ల తర్వాత సల్మాన్ ఖాన్ - ప్రభుదేవా కాంబినేషన్లో రాబోతున్న 'రాధే'పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఈ చిత్రాన్ని డ్రగ్స్ మాఫియా నేపథ్యంతో రూపొందించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ సినిమాలో మేఘా ఆకాశ్, దిశాపటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రణ్ దీప్ హుడా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి, సోహైల్ ఖాన్ సంయుక్తంగా నిర్మించారు. ఇది మే 13న విడుదల కాబోతుంది.