సెన్సేషనల్ సామజవరగమన వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో ట్రెండ్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అల వైకుంఠపురములో చిత్రంలోని సామజవరగమన అనే పాట ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌లో తొలి వంద మిలియన్ల పాటగా రికార్డులు క్రియేట్ చేసింది. సామజవరగమన అనే ఒక్క పాటతో అల వైకుంఠపురములో చిత్రంపై అంచనాలు ఆకాశన్నంటాయి. లిరికల్ వీడియోనే ఇంతటి సంచలనం సృష్టిస్తే వీడియో పాట ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అల వైకుంఠపురములో చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలవడానికి తమన్ అందించిన పాటలే ముఖ్య కారణం. కేవలం పాటలతోనే సినిమాను ఓ స్థాయిలో నిలబెట్టేశాడు. ఒక్కో పాటతో యూట్యూబ్‌ను షేక్ చేసేశాడు. సామజవరగమనతో మొదలైన ఈ ప్రభంజన సిత్తరాల సిరపడు సాంగ్‌తో మొదలైంది. రాములో రాములో, బుట్టబొమ్మ, అల వైకుంఠపురములో ఇలా ప్రతీ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మరోమారు రికార్డుల మోత మోగించేందుకు సామజవరగమన రంగంలోకి దిగింది. రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపిన సామజవరగమన వీడియో సాంగ్ కాసేపటి క్రితమే విడుదలైంది. విడుదలైన క్షణం నుంచీ వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. మరి మీరు ఈ వీడియో సాంగ్‌ను చూసేయండి.


Click it and Unblock the Notifications











