Just In
Don't Miss!
- News
జగన్ రెడ్డి క్రూరత్వం.. దేవినేని ఉమా అరెస్ట్ అక్రమం ; కొడాలి నానిపై కేసు పెట్టాలని చంద్రబాబు ఆక్రోశం
- Sports
గెలిచిన ఆనందంలో రోహిత్ శర్మ నోట బూతులు.. వీడియో వైరల్!
- Finance
9 శాతం వడ్డీకే క్రెడిట్ కార్డు క్యాష్: కస్టమర్లకు తక్కువ, వారికి మాత్రం ఎక్కువ వడ్డీ
- Automobiles
ముఖేష్ అంబానీ సెక్యూరిటీలో చేరిన 4 కొత్త కార్లు.. ఒక్కక్కటి 2 కోట్లకు పైమాటే
- Lifestyle
ఈ హార్మోన్ల సమస్య ఉన్న మహిళలు బరువు తగ్గడం చాలా కష్టం...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కూల్ అండ్ ఫీల్ గుడ్‌లా ‘ప్రాణం’.. జాను ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
తమిళ నాట సంచలనం సృష్టించి.. త్రిష కెరీర్‌ను మలుపుతిప్పిన చిత్రం 96. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన 96 చిత్రం కోలీవుడ్‌లో సంచలనాలు నమోదు చేసింది. ఈ చిత్రానికి, త్రిషకు లెక్కలేనన్ని అవార్డులను తెచ్చిపెట్టింది. ఈ సినిమా విడదులయ్యాక దక్షిణాదిన టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఎక్కడ చూసినా 96 గురించే వార్తలు వినిపించాయి. అంతగా మెస్మరైజ్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ రీమేక్ చేసేందుకు దిల్ రాజు ముందుకు వచ్చాడు. ఆ కథలో ఉన్న ఫీల్‌ను తెలుగు ప్రేక్షకులకు కూడా రుచి చూపించేందుకు సిద్దమయ్యాడు.
96ను తెరకెక్కించిన దర్శకుడు ప్రేమ్ కుమార్.. రీమేక్‌ను సైతం అందంగా మలిచినట్టు టాక్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్ సినిమాపై మంచి అంచనాలే పెంచాయి. జాను (జానకీ దేవీ) పాత్రలో సమంత నటిస్తుండగా.. రామచంద్ర పాత్రను శర్వానంద్ పోషిస్తున్నాడు. వీరిద్దరి కెమిస్ట్రీనే జాను సినిమాకు ప్రధాన బలంగా మారనున్నట్టు తెలుస్తోంది.
This journey ! ❤️Here's the lyrical of Pranam, the first single from #Jaanu...https://t.co/SIlRTSBWdq
— Samantha Akkineni (@Samanthaprabhu2) January 21, 2020

తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు. ప్రాణం అంటూ సాగే ఈ పాట కూల్ అండ్ ఫీల్ గుడ్‌లా అనిపిస్తోంది. ఈ పాటను చిన్మయి శ్రీపాద, గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు. విజయ్ సేతుపతి-త్రిషల మ్యాజిక్‌ను వీరు మ్యాచ్ చేస్తారా? లేదా అన్నది చూడాలి. 96 చిత్రం విజయవంతం కావడానికి గోవింద్ వసంత్ అందించిన సంగీతం ప్రధాన బలంగా మారగా.. జాను సినిమాకు అతనే మ్యూజిక్ కంపోజ్ చేస్తుండటం ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది.