సమంత సాయం కోరిన విజయ్ దేవరకొండ: తమ్ముడి కోసం ఆమెను ఒప్పించాడుగా

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను హీరోగా పరిచయం చేశాడు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ. ప్యూర్ లవ్ స్టోరీతో వచ్చిన 'దొరసాని' అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయిన అతడు.. మొదటి చిత్రంతోనే ఆకట్టుకున్నాడు. ఇది హిట్ కాకున్నా యాక్టర్‌గా పేరును మాత్రం సంపాదించుకున్నాడు. ఆ వెంటనే 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక, ఇప్పుడు ఆనంద్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.

ఆనంద్ దేవరకొండ.. దామోదర అనే కొత్త దర్శకుడితో చేస్తున్న చిత్రమే 'పుష్పక విమానం'. వినూత్నమైన కథతో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే పోస్టర్లు, ఓ పాట విడుదలయ్యాయి. వీటికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఇప్పుడు మరో సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నారు. 'కల్యాణం' అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను జూన్ 18 ఉదయం 11 గంటలకు వదలబోతున్నారు. దీన్ని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత లాంఛ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.

Samantha to Launch Pushpaka Vimanam Kalyanam​ Lyrical Song

ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత హీరో ఎలాంటి కష్టాలను అనుభవించాడనే డిఫరెంట్ కాన్సెప్టుతో 'పుష్పక విమానం' రూపొందుతోంది. ఇందులో ఆనంద్ దేవరకొండ సరసన శాన్వి మేఘన, గీత సైని హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే, సునీల్, నరేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక, ఈ సినిమాతో ముగ్గురు అమిత్ దాసాని, సిద్దార్థ్ సదాశివుని, రామ్ మిరియాల మ్యూజిక్ డైరెక్టర్లుగా పరిచయం అవుతున్నారు. ఇక, ఈ సినిమాను విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ ఆఫ్ ద హిల్స్, టంగా ప్రొడక్షన్స్ బ్యానర్లపై గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ బాషీ, ప్రదీప్ ఎర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X