twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అదిరిపోయే మాస్ నంబర్.. ‘సీటీమార్’పై సంపత్ నంది కామెంట్స్

    |

    సంపత్ నంది ప్రస్తుతం సీటీమార్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సీటీమార్ షూటింగ్‌కు ఎన్నో అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా కూడా ముందుకు కొనసాగుతూనే ఉన్నారు. కరోనా, లాక్డౌన్‌ వల్ల అంతా తారుమారైంది. అయితే అన్ లాక్ ప్రక్రియ తరువాత సినిమా షూటింగ్ మొదలుపెట్టినా కూడా తమన్నాకు కరోనా రావడంతో మళ్లీ షూటింగ్ వాయిదా పడింది. అలా నిత్యం ఏదో రకంగా బ్రేకులు పడుతూనే వచ్చింది.

    అయితే ఈ మధ్యే సీటీమార్ యూనిట్ జైసల్మీర్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అక్కడ యాక్షన్ సీక్వెన్స్‌లు పూర్తి చేసిన చిత్రయూనిట్ హైద్రాబాద్‌లో వాలింది. ఇప్పుడు ఈ మూవీ యూనిట్ హైద్రాబాద్‌లోనే సందడి చేస్తుంది. తాజాగా సంపత్ నంది మూవీ షూటింగ్‌ అప్డేట్‌ను చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ఓ చిన్నపాటి వీడియోను కూడా షేర్ చేశాడు. అదిరిపోయే మాస్ నంబర్ రాబోతోందంటూ హైప్ పెంచేశాడు.

    Sampath nandi About Seetimaarr Song Shoot

    హైద్రాబాద్‌కు తిరిగి వచ్చేశాం.. పటాఖా సాంగ్‌ షూటింగ్‌ను నేడు ప్రారంభించాం.. ఇందులో గోపీచంద్, తమన్నా ఇద్దరూ దుమ్ములేపనున్నారు.. అదిరిపోయే మాస్ నంబర్ రాబోతోందని మీకు ప్రామీస్ వేసి చెబుతున్నా అంటూ అందరిలోనూ అంచనాలు పెంచేశాడు. ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ, భూమిక, రెహమాన్, తరుణ్ అరోరా వంటివారు ఇతర పాత్రలను పోషిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 2న ఈ సినిమా రాబోతోంది.

    English summary
    Sampath nandi About Seetimaarr Song Shoot
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X