Devil Song సంయుక్త మీనన్‌తో కళ్యాణ్ రామ్ కెమిస్ట్రీ అదుర్స్.. బ్యూటీతో దూరమే తీరమై అంటూ నందమూరి హీరో
లయన్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం డెవిల్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక, నిర్మాతగా ఈ సినిమాను రూపొందించారు. 1942 సంవత్సరంలో బ్రిటీష్ పాలనలో జరిగే కథా నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్నది. పీరియడ్ డ్రామాగా తెరకెక్కిన బ్రిటీష్ ఇండియా పాలనకు సంబంధించిన కథతో తెరకెక్కిన సినిమా కావటంతో నాటి పరిస్థితులను ఆవిష్కరించేలా భారీగా సినిమాను చిత్రీకరించారు. ఈ సినిమాకు సంబంధించిన మెలోడి పాటను అభిమానులకు అందించారు. ఆ పాట, సినిమా వివరాల్లోకి..
బ్రిటిష్ కాలంలో సీక్రెట్ ఏజెంట్‌గా నటించిన కళ్యాణ్ రామ్ ఇలాంటి పాత్రను ఆయన చేయటం ఇదే మొదటిసారి. దర్శక నిర్మాత అభిషేక్ నామా, కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ , కళ్యాణ్ రామ్ లుక్‌ను సినిమాలో సరికొత్తగా ఉండేలా డిజైన్ చేశారు. డెవిల్ సినిమా కోసం కళ్యాణ్ రామ్ 90 కాస్ట్యూమ్స్‌ను ఉపయోగించారు. ఇటలీ నుంచి తెప్పించిన మోహైర్ ఊల్‌తో 60 బ్లేజర్స్‌ను ప్రత్యేకంగా తయారు చేశారు. వెయిస్ట్ కోటుతో పాటు దేశీయ కాటన్‌తో కుర్తా, ధోతిని తయారు చేశారు. దాంతో సరికొత్త గెటప్‌లో కనిపించనున్నారు.

డెవిల్ సినిమాలో ప్రేక్షకులను రంజింప చేసే పాట దూరమే తీరమై పాటను రిలీజ్ చేశారు. ఈ పాటలో నందమూరి కల్యాణ్ రామ్, సంయుక్త మీనన్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఈ పాట కోసం ఉపయోగించిన వాయిద్యాలు మరింత మెలోడిగా మార్చాయి. ఈ పాటను యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరిచారు.
ఇక దూరమే తీరమై పాటకు సమీరా భరద్వాజ్ సాహిత్యం అందించడమే కాకుండా సాంగ్‌ను ఆలపించారు. ఈ పాటకు సంబంధించిన సింఫనీ రోమాలు నిక్కబొడిచేలా చేసింది. సంయుక్త గ్లామర్‌తో మరింత అందంగా ఆకట్టుకొన్నది. ఈ పాటలో కల్యాణ్ రామ్ లీనమై నటించారు.
ఇప్పటి వరకు విభిన్నమైన చిత్రాలను అందించిన అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా గాంధీ నదికుడికర్ వ్యవహరించారు. సౌందర్ రాజన్ ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలను అద్బుతంగా తెరకెక్కించారు. తమ్మిరాజు ఎడిటింగ్, శ్రీకాంత్ విస్సా కథను అందించారు.


Click it and Unblock the Notifications











