మురారీ మురారీ.. సరుగుతోట సరసం మరిచావా? ఫీల్‌గుడ్‌గా వజ్ర కవచధార రెండో సింగిల్
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ చిత్రాలతో మంచి విజయాలను అందుకొన్న స్టార్ కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన తాజా చిత్రం వజ్ర కవచధార గోవింద. శివ శివం ఫిల్మ్స్ బ్యానర్‌పై నరేంద్ర, జీవిఎన్ రెడ్డి నిర్మాతలుగా అరుణ్ పవర్ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాకు బుల్గానియన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సప్తగిరి సరసన హీరోయిన్‌గా వైభవి జోషి నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంటున్న ఈచిత్రం మే నెలలో రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ప్రమోషన్‌లో భాగంగా సినిమా మ్యూజిక్ ఆల్బమ్‌లోని రెండో సింగిల్‌ను మంగళవారం (మే 21వ తేదీన) విడుదల చేశారు.
మురారి మురారీ అంటూ సాగిన పాటలో సాహిత్యం ఆకట్టుకొనేలా ఉంది వెదురుపాక పొదలకాడ మొదటి ముద్దు అంటూ గాయని స్పూర్తి జితేందర్ పాడిన పాట అద్భుతంగా ఉంది. ఆమె వాయిస్ పెక్యులర్‌గా ఉందనే ఫీలింగ్ కలిగింది. పలమనేరు సరుగు తోట.. సరసమంతా మరిచినావా.. చూసి కూడా చూడనట్టు అంటూ సాహిత్యం ఫీల్‌గుడ్‌గా సాగింది. మురారీ మురారీ.. రాధేకృష్ణ మురారీ.. విహారి విహారీ ఎక్కించు లవ్ సవారీ అంటూ రామజోగయ్య శాస్త్రి రాసిన పాట ఆసాంతం మధురంగా సాగింది.

మూవీ: వజ్ర కవచధార గోవింద
పాట: మురారీ మురారీ
బ్యానర్: శివశివమ్ ఫిల్మ్స్
సంగీతం: బుల్గానియన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: స్ఫూర్తి జితేందర్
మ్యూజిక్: ఆదిత్య మ్యూజిక్
దర్శకత్వం: అరుణ్ పవార్
ఎడిటర్: కిషోర్ మద్దాలి
డీవీపీ: ప్రవీణ్ వనమాలి


Click it and Unblock the Notifications











