For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Shyam Singha Roy: నానికి అప్పుడే అదిరిపోయే డీల్.. సౌతిండియాలో హవా చూపించేలా దూకుడు

  |

  బ్యాగ్రౌండ్ లేకపోయినా సినిమాల్లోకి ప్రవేశించి.. తనదైన శైలి నటనతో అతి తక్కువ కాలంలోనే ప్రత్యేకమైన ఇమేజ్‌తో పాటు స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని. అసిస్టెంట్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో ప్రయాణం మొదలు పెట్టిన అతడు.. ఆ తర్వాత హీరోగా మారి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను అందుకున్నాడు. అలాగే, ప్రతి సినిమాలోనూ సహజ సిద్ధమైన నటనను కనబరిచే అతడు.. అన్నింటినీ వన్ మ్యాన్ షోలుగా మార్చుకున్నాడు. తద్వారా మంచి నటుడిగా పేరు తెచ్చుకోవడంతో పాటు ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు.

  మితిమీరిన జాన్వీ కపూర్ హాట్ షో: ఘాటు ఫోజులో అందాలను మొత్తం చూపిస్తోన్న శ్రీదేవి కూతురు

  నేచురల్ స్టార్ నాని ఇటీవలే 'టక్ జగదీష్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓటీటీలో విడుదలైన ఈ మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీనితో పాటు అతడు ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో 'శ్యామ్ సింగ రాయ్' ఒకటి. 'ట్యాక్సీవాలా'తో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న రాహుల్ సంకృత్యన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. పూర్తి స్థాయి విభిన్నమైన కథతో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. చాలా రోజుల క్రితమే మొదలైన ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తైంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

  Saregama South Bagged Nanis Shyam Singha Roy Music Rights

  'శ్యామ్ సింగ రాయ్' మూవీలో వీఎఫ్ఎక్స్ షాట్స్ ఎక్కువగా ఉంటాయని ఇప్పటికే యూనిట్ వెల్లడించింది. అందుకే ఇది షూటింగ్‌ను ఎప్పుడో పూర్తి చేసుకున్నా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం ఇంకా పూర్తి కాలేదనే టాక్ వినిపిస్తోంది. ఇక, ఈ సినిమా కూడా 'టక్ జగదీష్' మాదిరిగానే ఓటీటీలో నేరుగా విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. కానీ, దీన్ని మాత్రం థియేటర్లలోనే విడుదల చేయబోతున్నట్లు కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. అంతేకాదు, ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ చిత్రంతో దక్షిణాదిలో సత్తా చాటాలని నాని భావిస్తున్నాడు.

  Bigg Boss 5 Telugu Wild Card Entry: ఎలిమినేట్ అయిన బ్యూటీకి బాస్ ఆఫర్.. షోలోకి ఆ లేడీ కంటెస్టెంట్ రీఎంట్రీ!

  క్రేజీ కాంబినేషన్‌లో ఏకంగా నాలుగు భాషల్లో రాబోతున్న 'శ్యామ్ సింగ రాయ్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ మ్యూజిక్ రైట్స్‌ను సరేగమా సౌత్‌ సంస్థ దక్కించుకుంది. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తం చెల్లించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో నాని పేరు దక్షిణాదిలోని అన్ని ఇండస్ట్రీల్లో మారమ్రోగిపోతోంది. అలాగే, 'శ్యామ్ సింగ రాయ్'పైనా అందరూ దృష్టి సారిస్తున్నారు.

  వైవిధ్యమైన కథతో రాబోతున్న 'శ్యామ్ సింగ రాయ్' నుంచి ఇప్పటి వరకూ విడుదలైన అన్ని పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఇందులో నాని కోరమీసంతో కనిపించిన తీరు ఆకట్టుకుంది. ఇక, ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జిషు సేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం కీలక పాత్రలు పోషించారు. వెంకట్ బోయినపల్లి దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చుతున్నాడు.

  English summary
  Natural Star Nani Did Shyam Singha Roy Movie Under Shyam Singha Roy Direction. Saregama South Bagged This Movie Music Rights.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X