Kushi: విజయ్ దేవరకొండ నయా రికార్డు.. ఏకంగా అన్ని కోట్లతో డీల్
టాలీవుడ్‌లోకి ఎలాంటి సపోర్ట్ లేకుండానే వచ్చినా.. తనదైన శైలి యాక్టింగ్, స్టైల్స్, బాడీ లాంగ్వేజ్‌తో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని.. తక్కువ సమయంలోన స్టార్‌గా ఎదిగిపోయాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. దీనికితోడు ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకుని ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను భారీగా పెంచుకున్నాడు. అయితే, గత ఏడాది వచ్చిన 'లైగర్' మూవీతో మాత్రం విజయ్‌కు భారీ షాకే తగిలింది. అంతేకాదు, అతడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ఇది మిగిలింది. దీన్ని ఏమాత్రం సీరియస్‌గా తీసుకోని అతడు వరుస చిత్రాలు చేస్తోన్నాడు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'ఖుషి' అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో సమంత రూత్ ప్రభు హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది. అలాగే, ఇటీవలే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో సినిమాపై అంచనాలు కూడా రెట్టింపు అయ్యాయి. దీంతో ఈ మూవీ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. ఇక, తాజాగా ఈ చిత్రం నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది.

ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో రూపొందుతోన్న'ఖుషి' మూవీపై నెలకొన్న అంచనాల ప్రకారమే ఈ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమా ఆడియో రైట్స్‌ను ప్రముఖ సంస్థ సరేగమ సౌత్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఇదిలా ఉండగా.. 'ఖుషి' మూవీ ఆడియో హక్కుల కోసం సదరు సంస్థ కొన్ని కోట్ల భారీ మొత్తాన్నే చెల్లించినట్లు తెలిసింది. ఇది విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్ అని అంటున్నారు. ఇక, ఈ చిత్రానికి హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని ఇస్తున్నారు.
క్రేజీ కాంబోలో వస్తున్న 'ఖుషి' మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య తదితరులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











