సరిలేరు పాట లీక్: తమన్నా, పూజాహెగ్డేతో మహేష్ ఊరమాస్.. ఐదేళ్ల తర్వాత ఐటెం సాంగ్స్‌తో..

మహర్షి తర్వాత మహేష్ బాబు.. F2 అనంతరం రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి పండుగ కానుకగా వస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే టైటిల్ ఫస్ట్‌లుక్ క్రేజ్‌ను తీసుకురాగా, స్వాతంత్ర్యపు దినోత్సవం రోజున ఓ లిరికల్ సాంగ్ రిలీజ్ కావడం అభిమానుల్లో మంచి జోష్ నింపింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఆ క్రేజీ ఐటమ్ సాంగ్ ఏమిటంటే..

 మహేష్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని

మహేష్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని

సూపర్‌స్టార్ మహేష్ బాబు, దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్ వచ్చిన సినిమా మ్యూజిక్‌ను అభిమానులు పెద్ద ఎత్తున ఆదరించారు. తాజాగా మహేష్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని దేవీ శ్రీ ప్రసాద్ ఊరమాస్ ఐటెం సాంగ్‌ను రూపొందించినట్టు సమాచారం. గతంలో మహేష్‌కు మాస్ సాంగ్స్ ఇవ్వలేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఈ సారి మాత్రం మాస్‌తో పిచ్చెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తున్నది.

ఐదేళ్ల క్రితం చివరిగా ఐటెం సాంగ్

ఐదేళ్ల క్రితం చివరిగా ఐటెం సాంగ్

మహేష్ బాబు ఐటెం సాంగ్ చేసి నాలుగైదు ఏళ్లు కావొస్తుంది. ఆగడు సినిమాలో జంక్షన్‌లో అంటూ శృతిహాసన్‌తో చేసిన ఐటెం సాంగ్ చివరిదైంది. తాజాగా మహేష్ కోసం బందరు మిఠాయి.. బోర్డర్ సిపాయి అనే పాటను దేవీ శ్రీ ప్రసాద్ రూపొందించారనే విషయం సినీ వర్గాల్లో ప్రచారం అవుతున్నది. ఈ పాట మహేష్ కెరీర్‌లోనే ఊర మాస్‌గా మారుతుందట.

తాజాగా పూజా హెగ్డేతో స్పెషల్ సాంగ్

తాజాగా పూజా హెగ్డేతో స్పెషల్ సాంగ్

ఇక బందరు మిఠాయి.. బోర్డర్ సిపాయి అనే పాటను పూజా హెగ్డే, మహేష్ బాబుపై చిత్రీకరించడానికి రంగం సిద్ధమైనట్టు సమాచారం. ఇప్పటికే రంగస్థలం సినిమాతో ఐటెమ్ రాణిగా మారిన పూజా హెగ్డే ఇప్పుడు మళ్లీ మరోసారి స్పెషల్ సాంగ్‌లో మెరువడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ పాట మ్యాజిక్ చేయడం గ్యారంటీ అనే భరోసాను దేవీ శ్రీ ప్రసాద్ ఇస్తున్నారట.

తమన్నా స్పెషల్ సాంగ్

ఇక సరిలేరు నీకెవ్వరు చిత్రంలో తమన్నా భాటియా ప్రత్యేకమైన పాటలో డ్యాన్స్ చేయనున్నారు. 1970 బ్యాక్ డ్రాప్‌తో ఆర్మీ నేపథ్యంగా పిరియాడిక్ ఈ చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్రంలో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సాంగ్‌లో తమన్నా ప్రత్యేక ఆకర్షణగా మారనున్నది.

రష్మికతో మహేష్ రొమాన్స్

ఇక సరిలేరు నీకెవ్వరూ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక మందన్న, మహేష్ బాబుపై ఓ పాటను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.

 విజయశాంతి రీఎంట్రీ

విజయశాంతి రీఎంట్రీ

మహేష్ బాబు, రష్మిక మందన్నతోపాటు విజయశాంతి చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇంకా ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, ప్రకాశ్ రాజ్, నరేష్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, బ్రహ్మనందం, వెన్నెల కిషోర్, ప్రదీప్ రావత్ నటిస్తున్నారు. సినిమాటోగ్రఫి: ఆర్ రత్నవేలు, ఎడిటింగ్: తమ్మిరాజు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X