సర్కారు వారి పాట ఆడియో రైట్స్.. భారీ ధరకు దక్కించుకున్న బడా సంస్ధ!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి రాబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట అసలు సందడి మొదలైంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గత ఏడాది నుంచి ప్రేక్షకులను ఎంతగానో ఊరిస్తోంది. కరోనా కారణంగా షూటింగ్ పనులకు చాలాసార్లు బ్రేకులు పడ్డాయి. ఇక మధ్యలో మరికొన్ని కారణాల వలన అప్డేట్స్ కూడా ఇవ్వడం కుదరలేదు. ఇక ప్రస్తుతం అందరూ రిలీజ్ డేట్స్ పై ఫోకస్ పెట్టడంతో మహేష్ టీమ్ కూడా సందడి మొదలు పెట్టింది.

సర్కారు వారి పాటకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను శనివారం విడుదల చేయబోతున్నారు. మహేష్ బాబు నెవ్వర్ బిఫోర్ అనే లుక్కుతో కనిపిస్తాడని చిత్ర యూనిట్ ఇప్పటికే చాలాసార్లు చెప్పింది. మహేష్ బాబుకు జోడిగా ఇందులో కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక సినిమాకు సంబంధించిన ఆడియో హక్కుల కోసం గత కొన్ని రోజులుగా బడా కంపెనీలు చర్చలకు రాగా ఎవరు ఊహించని విధంగా ఒక తమిళ సంస్థ ఆడియో రైట్స్ ను దక్కించుకుంది.

Sarkaru Vaari Paata Audio Rights bagged by renowned audio label saregama south

ఎక్కువగా కోలీవుడ్ సినిమాల ఆడియో హక్కులను దక్కించుకునే 'సరిగమ సౌత్ ఇండియా' సర్కారు వారి పాట హక్కులను కూడా భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని పాటల యొక్క ట్యూన్స్ సిద్ధం చేసిన థమన్ ఒక సాంగ్ ను పూర్తిగా రెడీ చేశాడట.

సినిమాలో మ్యూజిక్ కూడా సరికొత్తగా ఉంటుందని సమాచారం. మహేష్ బాబు - థమన్ కాంబినేషన్ లో వచ్చిన సాంగ్స్ అన్ని కూడా బెస్ట్ మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. మరి ఈసారి సర్కారు వారి పాటతో ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమాను 2022 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X