Sarkaru Vaari Paata నుంచి రిపబ్లిక్ డే గిఫ్ట్: అసలైంది మాత్రం ఆరోజే రాబోతుందట

యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన చిత్రాల్లో నటిస్తూ చాలా కాలంగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. దీంతో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అందుకోవడంతో పాటు మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో మహేశ్ బాబు వరుసగా 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ హిట్లతో హ్యాట్రిక్‌ను కూడా సొంతం చేసుకుని హవాను చూపిస్తున్నాడు.

వరుస విజయాలతో ఫుల్ జోష్‌తో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే దీన్ని చిత్ర యూనిట్ ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తోంది. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పరారవుతోన్న బడా పారిశ్రామికవేత్తలను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మహేశ్ బాబు అదిరిపోయే వింటేజ్ లుక్‌తో కనిపించబోతున్నాడని టీజర్‌లోనే చూపించారు.

Sarkaru Vaari Paata First Song Announcement On January 26th

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'సర్కారు వారి పాట'కు సంబంధించిన షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతోన్నా.. దీని నుంచి అప్‌డేట్లు మాత్రం అంతగా రావడం లేదు. గత సంవత్సరం మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా 'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' పేరిట ఓ వీడియో విడుదలైంది. దీనికి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా ఈ టీజర్ టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను కూడా నమోదు చేసింది. దీని తర్వాత ఈ సినిమా నుంచి పాటలను కూడా విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, అలా ఏమీ జరగలేదు. దీనిపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ చిత్ర యూనిట్‌పై గుర్రుగా ఉన్నారు.

ఇక, 'సర్కారు వారి పాట' మూవీ నుంచి మొదటి పాటను జనవరిలోనే విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, అనివార్య కారణాలతో అది సాధ్య పడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ 'ఫిబ్రవరి 14న సాంగ్' అంటూ ఓ ట్వీట్ చేశాడు. దీంతో ఇది ఈ సినిమాకు సంబంధించినదే అని అందరిలో క్లారిటీ వచ్చేసింది. ఇక, తాజా సమాచార ప్రకారం.. 'సర్కారు వారి పాట' సినిమాకు సంబంధించిన మొదటి పాట ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఫిబ్రవరి 14న విడుదల చేస్తారట. దీనిని రిపబ్లిక్ డే కానుకగా స్పెషల్ పోస్టర్‌తో ప్రకటించబోతున్నారని తాజాగా తెలిసింది.

'సర్కారు వారి పాట' మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుందని ప్రకటించారు. కానీ, అప్పటికి ఇది పూర్తయ్యే అవకాశాలు లేకపోవడంతో దీన్ని ఏప్రిల్‌కు వాయిదా వేశారు. ఇప్పుడు ఆ డేట్ కూడా మారిపోయే అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X