SVP First Single: అదిరిపోయే పోస్టర్‌తో సర్‌ప్రైజ్ చేసిన సర్కారు వారి పాట టీమ్

'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుని యమ జోష్ మీదున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే అతడు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నాడు. పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమా బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పరార్ అవుతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. క్రేజీ కాంబినేషన్‌ కావడంతో ఈ మూవీపై అంచనాలు ఆరంభం నుంచే భారీ స్థాయిలో నెలకొన్న విషయం తెలిసిందే.

'సర్కారు వారి పాట' సినిమా కమర్షియల్ హంగులతో కూడిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. దీనిపై ఉన్న అంచనాలకు అనుగుణంగానే దీన్ని చిత్ర యూనిట్ ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తోంది. వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా.. చాలా ఆలస్యం అయింది. ఈ క్రమంలోనే గత ఏడాది జనవరిలో రెగ్యూలర్ షూట్‌ను మొదలు పెట్టారు. అప్పటి నుంచి హైదరాబాద్, దుబాయ్‌లో పలు షెడ్యూళ్లను జరిపించారు. ఇలా ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి దాదాపు అరవై శాతం షూటింగ్ పూర్తైపోయినట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన పార్ట్‌ను త్వరలోనే మొదలెట్టనున్నారు.

Sarkaru Vaari Paata First Song Date Announced

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట'కు సంబంధించిన షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతోన్నా.. దీని నుంచి గత ఆగస్టులో మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా 'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' పేరిట ఓ వీడియో మాత్రమే విడుదలైంది. దీనికి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా ఈ టీజర్ టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను కూడా నమోదు చేసింది. దీని తర్వాత ఈ సినిమా నుంచి పాటలను కూడా విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, అలా మాత్రం ఏమీ జరగలేదు. దీంతో అభిమానులు మ్యూజికల్ ఫీస్ట్ కోసం వేచి చూస్తున్నారు.

ఇక, 'సర్కారు వారి పాట' మూవీకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ గురించి కొద్ది రోజులుగా చాలా రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే చిత్ర యూనిట్ తాజాగా దీనిపై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఇందులో ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక, దీని కోసం విడుదల చేసిన పోస్టర్‌లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్టైలిష్ లుక్‌తో కనిపించాడు. దీంతో సూపర్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ పాట అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని థమన్ సోషల్ మీడియాలో తెలిపాడు.

Sarkaru Vaari Paata First Song Date Announced

భారీ బడ్జెట్‌తో రాబోతున్న 'సర్కారు వారి పాట' మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుందని ప్రకటించారు. కానీ, అప్పటికి ఇది పూర్తయ్యే అవకాశాలు లేకపోవడంతో దీన్ని ఏప్రిల్‌కు వాయిదా వేశారు. ఇప్పుడు ఆ డేట్ కూడా మారుతుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X