twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SVP First Single: అదిరిపోయే పోస్టర్‌తో సర్‌ప్రైజ్.. ఆ సినిమాను గుర్తు చేసిన మహేశ్

    |

    ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ గతంలో ఎన్నడూ లేనంత ఫామ్‌తో కనిపిస్తున్నాడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ జోష్‌తోనే అతడు ఫ్యూచర్ ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఈ స్టార్ హీరో ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమా బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతోంది. క్రేజీ కాంబినేషన్‌ కావడంతో ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.

    బాత్రూంలో బ్రాతో రెచ్చిపోయిన హీరోయిన్: అద్దంలో అందాలన్నీ చూపిస్తూ దారుణంగా!బాత్రూంలో బ్రాతో రెచ్చిపోయిన హీరోయిన్: అద్దంలో అందాలన్నీ చూపిస్తూ దారుణంగా!

    ఫుల్ ఫామ్‌లో ఉన్న మహేశ్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' సినిమా కమర్షియల్ హంగులతో కూడిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. అంచనాలకు అనుగుణంగానే దీన్ని చిత్ర యూనిట్ ఎంతో ప్రతిష్టాత్మంగా రూపొందిస్తోంది. వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా.. చాలా ఆలస్యం అయింది. ఈ క్రమంలోనే గత ఏడాది జనవరిలో రెగ్యూలర్ షూట్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి హైదరాబాద్, దుబాయ్‌, విశాఖపట్నంలలో కొన్ని షెడ్యూళ్లను పూర్తి చేశారు. ఇలా ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి దాదాపు అరవై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. దీంతో మిగిలిన పార్ట్‌ను ఇప్పుడు జరుపుతున్నారు.

    క్రేజీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న 'సర్కారు వారి పాట'కు సంబంధించిన షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతోన్నా.. దీని నుంచి మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా 'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' పేరిట ఓ వీడియో మాత్రమే వచ్చింది. దీనికి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. ఫలితంగా ఈ టీజర్ టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేసింది. దీని తర్వాత ఈ సినిమా నుంచి పాటలను కూడా విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, అలా మాత్రం జరగలేదు. దీంతో సూపర్ స్టార్ అభిమానులు నిరాశగా ఉండిపోయారు.

    టాప్ విప్పేసి మరీ అషు రెడ్డి అరాచకం: లోదుస్తులు కూడా లేకుండా మహా దారుణంగా!టాప్ విప్పేసి మరీ అషు రెడ్డి అరాచకం: లోదుస్తులు కూడా లేకుండా మహా దారుణంగా!

    Sarkaru Vaari Paata First Song Poster

    'సర్కారు వారి పాట' నుంచి మ్యూజికల్ ఫీస్ట్‌ను ప్రేమికుల రోజు నుంచి ప్రారంభించబోతున్నారు. ఇందులో భాగంగానే 'కళావతి' అంటూ సాగే మొదటి పాటను ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటన ఇప్పటికే వచ్చేసింది. ఇక, తాజాగా ఈ సాంగ్‌కు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఇందులో హీరో, హీరోయిన్ల లుక్స్‌ను చూపించారు. మరీ ముఖ్యంగా మహేశ్ బాబు గెటప్, స్టైల్ మాత్రం అదిరిపోయింది. అంతేకాదు, ఇందులో అతడు 'పోకిరి' సినిమాలో కనిపించినట్లుగా ఉన్నాడు. దీంతో ఈ పోస్టర్ తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయింది.

    మహేశ్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుందని ప్రకటించారు. కానీ, అప్పటికి ఇది పూర్తయ్యే అవకాశాలు లేకపోవడంతో దీన్ని మే 12కు వాయిదా వేశారు.

    English summary
    Mahesh Babu Now Doing Sarkaru Vaari Paata Movie under Parasuram Direction. This Movie First Song Poster Viral in Social Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X