Kalaavathi Song: మహేశ్ బాబు ఖాతాలో గొప్ప రికార్డు.. టాలీవుడ్‌లో నెంబర్ వన్ ప్లేస్

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న బడా హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకడు. బ్యాగ్రౌండ్ ఉన్నా.. యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్‌తో పాటు హ్యాండ్సమ్ లుక్స్‌తో మాయ చేస్తోన్న అతడు.. సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను ఫిదా చేస్తూనే ఉన్నాడు. ఫలితంగా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.

ఇలా ఈ మధ్య కాలంలో 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి హిట్లతో హ్యాట్రిక్‌ను కూడా సాధించాడు. ఈ జోష్‌తోనే ఇప్పుడు 'సర్కారు వారి పాట'లో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మహేశ్ బాబు ఓ గొప్ప రికార్డును చేరుకున్నాడు. ఆ వివరాలు మీకోసం!

వాళ్లందరితో సర్కారు వారి పాట

వాళ్లందరితో సర్కారు వారి పాట

వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న మహేశ్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. పరశురాం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

సినిమా కథ... మహేశ్ రోల్ ఇలా

సినిమా కథ... మహేశ్ రోల్ ఇలా

బ్యాంకులను మోసం చేసే బిజినెస్‌మ్యాన్‌లను టార్గెట్ చేస్తూ ‘సర్కారు వారి పాట' మూవీ తెరకెక్కుతోందట. హీరో తండ్రైన బ్యాంకు ఉద్యోగిని మోసం చేసిన విలన్.. విదేశాలకు పారిపోతాడు. దీంతో హీరో.. తన తండ్రి నిజాయితీని నిరూపించేందుకు విలన్‌ ఆట కట్టించడమే ఈ మూవీ కథ అంటున్నారు. ఇక, ఇందులో మహేశ్ బాబు రోల్ పాత రోజులను గుర్తు చేసేలా ఉంటుందట.

షూటింగ్ వివరాలు.. శరవేగంగా

షూటింగ్ వివరాలు.. శరవేగంగా

పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ‘సర్కారు వారి పాట' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతూ వచ్చింది. ఇటీవలే ఈ సినిమా ఫారెన్ షెడ్యూల్‌ను జరుపుకుంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు పాటలను కూడా షూట్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోనూ షూట్ చేశారు. ఇలా ఇప్పటి వరకూ ఈ మూవీ షూటింగ్ 70 శాతం మాత్రమే పూర్తైందని టాక్.

సినిమా వాయిదా.. మళ్లీ అంటూ

సినిమా వాయిదా.. మళ్లీ అంటూ

పరశురాం దర్శకత్వంలో మహేశ్ బాబు నటిస్తోన్న ‘సర్కారు వారి పాట' మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, షూటింగ్ ఆలస్యం కావడంతో దీన్ని ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అయితే, ఇప్పుడు ఈ సినిమా మరోసారి వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఎటువంటి క్లారిటీ మాత్రం రావడం లేదు.

కళావతి వచ్చింది.. కుమ్మేసింది

కళావతి వచ్చింది.. కుమ్మేసింది

‘సర్కారు వారి పాట' నుంచి మ్యూజికల్ ఫీస్ట్‌ను ప్రేమికుల రోజు నుంచి ప్రారంభించారు. ఇందులో భాగంగానే ‘కళావతి' అంటూ సాగే మొదటి పాటను ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేశారు. సాఫ్ట్ మెలోడీగా వచ్చిన ఈ సాంగ్‌ను థమన్ కంపోజ్ చేయగా.. సిద్ శ్రీరామ్ ఆలపించాడు. దీనికి అన్ని వర్గాల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే.

అరుదైన రికార్డును అందుకుంది

‘కళావతి' సాంగ్‌కు మొదటి నుంచీ మంచి రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ పాట ఒక్కరోజులోనే ఎక్కువ వ్యూస్ సాధించి టాలీవుడ్‌లో సరికొత్త రికార్డును నమోదు చేసింది. అలాగే, ఈ పాట రీల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సర్కారు వారి పాటలోని కళావతి సాంగ్ తాజాగా యాభై మిలియన్ల వ్యూస్ అందుకుని మరో ఘనతను చేరుకుంది.

Recommended Video

Keerthy Suresh Interview కీర్తి తో జయమ్మ పంచాయతీ | Good Luck Sakhi | Filmibeat Telugu
టాలీవుడ్‌లో నెంబర్ వన్ సాంగ్

టాలీవుడ్‌లో నెంబర్ వన్ సాంగ్

‘కళావతి' సాంగ్ తాజాగా యూట్యూబ్‌లో యాభై మిలియన్ వ్యూస్‌తో పాటు 1.3 మిలియన్ లైకులను కూడా సొంతం చేసుకుంది. ఫలితంగా తక్కువ సమయంలోనే 50 మిలియన్ మార్కును చేరుకున్న సాంగ్‌గా ఇది రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు, 13 రోజులుగా ట్రెండింగ్ అవడంతో పాటు సరేగమ తెలుగు ఛానెల్‌లో ఎక్కువ వ్యూస్ సాధించిన సాంగ్‌గా ఘనతలు అందుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X