మహేశ్ బాబు ఖాతాలో మరో అరుదైన రికార్డు.. ఏకంగా 8 కోట్లతో టాలీవుడ్‌లో టాప్ ప్లేస్

ఆ మధ్య కొన్ని చిత్రాలు నిరాశ పరిచినా.. కొరటాల శివ తెరకెక్కించిన 'భరత్ అనే నేను' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. అక్కడి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడని అతడు.. వరుస పెట్టి సినిమాలు చేస్తూనే వస్తున్నాడు. ఈ క్రమంలోనే దీని తర్వాత వంశీ పైడిపల్లితో 'మహర్షి', అనిల్ రావిపూడితో 'సరిలేరు నీకెవ్వరు' వంటి సినిమాలు చేశాడు. ఇవి కూడా భారీ విజయాలను అందుకున్నాయి. ఫలితంగా హ్యాట్రిక్ హిట్లను ఖాతాలో వేసుకున్నట్లు అయింది. ఈ జోష్‌తోనే మహేశ్ బాబు తన ఫ్యూచర్ ప్రాజెక్టులను కూడా ఒక్కొక్కటిగా లైన్‌లో పెట్టుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే.

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమా బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతోన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. క్రేజీ కాంబినేషన్‌ కావడంతో ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ భారీ సినిమా కమర్షియల్ హంగులతో కూడిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. అంచనాలకు అనుగుణంగానే దీన్ని చిత్ర యూనిట్ ఎంతో ప్రతిష్టాత్మంగా రూపొందిస్తోంది.

Sarkaru Vaari Paata Kalaavathi Song Reach 80 Million Views

'సర్కారు వారి పాట' నుంచి మ్యూజికల్ ఫీస్ట్‌ను ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభించారు. ఇందులో భాగంగానే 'కళావతి' అంటూ సాగే మొదటి పాటను ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేశారు. సాఫ్ట్ మెలోడీగా వచ్చిన ఈ సాంగ్‌ను థమన్ కంపోజ్ చేయగా.. సిద్ శ్రీరామ్ ఆలపించాడు. దీనికి అన్ని వర్గాల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. 'కళావతి' సాంగ్‌కు మొదటి నుంచీ మంచి రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ పాట ఒక్కరోజులోనే ఎక్కువ వ్యూస్ సాధించి టాలీవుడ్‌లో సరికొత్త రికార్డును నమోదు చేసింది. అలాగే, ఈ పాట రీల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

యూట్యూబ్‌లో 'కళావతి' సాంగ్‌కు క్లిక్కుల మీద క్లిక్కులు వస్తున్నాయి. దీంతో చాలా రోజులుగా ఈ పాట ట్రెండింగ్‌లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా సర్కారు వారి పాటలోని ఈ సాంగ్ తాజాగా 80 మిలియన్లు అంటే అక్షరాల ఎనిమిది కోట్లు వ్యూస్‌ను అందుకుని మరో ఘనతను చేరుకుంది. దీంతో వేగంగా ఈ మార్కును చేరుకున్న పాటగా ఇది టాలీవుడ్‌లో నయా రికార్డును నమోదు చేసుకుంది. అలాగే, ఈ పాటకు యూట్యూబ్‌లో ఇప్పటి వరకూ 1.6 మిలియన్ లైకులు కూడా వచ్చాయి. ఇక, మొత్తంగా సరేగమ తెలుగు ఛానెల్‌లో ఎక్కువ వ్యూస్ సాధించిన సాంగ్‌గా ఘనతనూ అందుకుంది.

మహేశ్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో సముద్రఖని, జగపతిబాబు, జయరాం తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X