మహేష్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. ఏకంగా 100 మిలియన్ వ్యూస్‌తో టాలీవుడ్ టాప్ ప్లేస్
కొరటాల శివ తెరకెక్కించిన 'భరత్ అనే నేను' మూవీతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అక్కడి నుంచి మళ్ళీ వెనుదిరిగి చూడని ఆయన వరుస పెట్టి సినిమాలు చేస్తూ హిట్ కొడుతూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ సినిమా తర్వాత వంశీ పైడిపల్లితో 'మహర్షి', అనిల్ రావిపూడితో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇక ఆయన 'సర్కారు వారి పాట' అనే సినిమా చేస్తుండగా దానైకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని పాటలు సూపర్ క్రేజ్ దక్కించుకుంటున్నాయి. తాజాగా ఈ సినిమా ఒక రికార్డు బద్దలు కొట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..

'సర్కారు వారి పాట'
మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమా బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోతున్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

మే 12న
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో సముద్రఖని, జగపతిబాబు, జయరాం తదితరులు నటిస్తున్నారు. ఈ మూవీ మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఫిబ్రవరి 14 న ఒక సాంగ్ విడుదల
క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా మీద ముందు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ భారీ సినిమా కమర్షియల్ హంగులతో కూడిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14 న ఒక సాంగ్ విడుదల చేశారు. 'కళావతి' అంటూ సాగే మొదటి పాటను ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేశారు.

సరికొత్త రికార్డు
ఈ సాంగ్‌ను థమన్ కంపోజ్ చేయగా.. సిద్ శ్రీరామ్ ఆలపించాడు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. ఇక ఈ పాటకు అన్ని వర్గాల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తున్న క్రమంలో ఒక్కరోజులోనే ఎక్కువ వ్యూస్ సాధించి టాలీవుడ్‌లో సరికొత్త రికార్డును నమోదు చేసింది. అలాగే, ఈ పాట రీల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Recommended Video


వంద మిలియన్ వ్యూస్
ఇక ఇప్పుడు యూట్యూబ్‌లో 'కళావతి' సాంగ్‌కు ఇప్పటికీ వ్యూస్ తగ్గలేదు. ఈ క్రమంలోనే తాజాగా సర్కారు వారి పాటలోని ఈ సాంగ్ తాజాగా 80 మిలియన్లు అంటే అక్షరాల వంద మిలియన్ వ్యూస్‌ను అందుకుని మరో ఘనతను చేరుకుంది. దీంతో వేగంగా ఈ మార్కును చేరుకున్న పాటగా ఇది టాలీవుడ్‌లో కొత్త రికార్డును నమోదు చేసుకుంది. అలాగే, ఈ పాటకు యూట్యూబ్‌లో ఇప్పటి వరకూ 1.7 మిలియన్ లైకులు కూడా వచ్చాయి. ఇక, మొత్తంగా సరేగమ తెలుగు ఛానెల్‌లో ఎక్కువ వ్యూస్ సాధించిన సాంగ్‌గా కూడా ఇది రికార్డు సృష్టించింది.


Click it and Unblock the Notifications











