Sarkaru vaari paata: కళావతి పాటతో సెన్సేషన్.. సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పాటగా రికార్డ్ బ్రేక్!
సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట మొత్తానికి మొదటి సాంగ్ తో అంచనాల డోస్ ను మరింత పెంచేసింది. రొమాంటిక్ మెలోడీ సాంగ్ కళావతి స్వఛ్చమైన తెలుగు భాషలో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న మహేష్ బాబు ఆ తరువాత వీలైనంత త్వరగా మరోలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నాడు. కానీ అనుకోకుండా కరోనా రావడంతో ఆ ప్లాన్ రివర్స్ అయ్యింది. దర్శకుడు పరశురామ్ మహేష్ కోసం పవర్ఫుల్ గా మంచి కథను జెట్ స్పీడ్ లో సిద్ధం చేసి ఒప్పించాడు. ఇక మొదటి పాట రికార్డు వివరాల్లోకి వెళితే..

ఆ విదంగా..
గీతగోవిందం సినిమాతో సక్సెస్ అందుకున్న తరువాత డైరెక్టర్ పరశురామ్ ను ప్రత్యేకంగా ప్రశంసించిన సూపర్ స్టార్ మాట్లాడిన కొన్ని గంటల్లోనే మంచి కథ ఉంటే చెప్పాలని ఆఫర్ ఇచ్చాడు. ఇక ఆ విధంగా సర్కారు వారి పాట సెట్టయ్యింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అంశం కూడా ప్రేక్షకులలో పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేస్తోంది. ఇక ఇటీవల సినిమాకు సంబంధించిన మొదటి పాటను కూడా విడుదల చేశారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

సరికొత్త ట్రెండింగ్
మహానటి కీర్తి సురేష్ మోదటిసారి మహేష్ బాబుతో నటిస్తుండడం ఈ సినిమాకు ఒక మంచి బజ్ క్రియేట్ చేసింది. వీరి కలయిక వెండితెరపై చాలా కొత్తగా ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు. ఇక దర్శకుడు తన టేస్ట్ కు తగ్గట్టుగా మొదటి పాటను డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. కళావతి పాట సోషల్ మీడియాలో ఒక సరికొత్త ట్రెండింగ్ రికార్డును క్రియేట్ చేసింది. ఈ పాట లిరికల్ వీడియో యూ ట్యూబ్ లో కూడా భారీ స్థాయిలో వ్యూవ్స్ అందుకుంటోంది.

సౌత్ ఇండియాలోనే..
సౌత్ ఇండియాలో 24 గంటల్లో అత్యధిక వ్యూవ్స్ అందుకున్న పాటగా కళావతి రికార్డును బ్రేక్ చేసింది. పుష్ప సినిమాలోని ఐటెమ్ సాంగ్ ఉ అంటావా.. 24 గంటల్లో 12.39 మిలియన్ల వ్యూవ్స్ అందుకోగా కళావతి పాట 12.40 మిలియన్ల వ్యూవ్స్ ను అందుకుంది. అది కూడా 20 గంటల్లోనే పాత రికార్డును బ్రేక్ చేసింది. మొత్తానికి మొదటి పాటతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇంకా విడుదల కావాల్సిన పాటలు ఉన్నాయి. మరి ఆ సాంగ్స్ ఏ రేంజ్ లో క్లిక్కవుతాయో చూడాలి.

విడుదల డేట్ ఫిక్స్..
ఇక సర్కారు వారి పాట సినిమాను గత ఎడాది లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి సినిమా తప్పకుండా వస్తుందని అనుకున్నారు. కానీ RRR కారణంగా మహేష్ ముందే వాయిదా వేసుకున్నారు. ఇక ఫైనల్ గా మే నెలలో ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. మే 12 వ తేదీన సినిమాను గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద సర్కారు వారి పాట ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











