Sarkaru Vaari Paata: మహేశ్ ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్.. ఈ సీజన్‌లోనే బెస్ట్ అంటూ!

పేరుకు బడా హీరో కుమారుడే అయినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో కెరీర్ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి.. తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయాడు బడా హీరో మహేశ్ బాబు. సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపించేలా కథలను ఎంచుకుంటూ వస్తున్న అతడు.. ఎన్నో భారీ విజయాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక, ఈ మధ్య కాలంలో మహేశ్ బాబు వరుసగా కొరటాల శివతో 'భరత్ అనే నేను', వంశీ పైడిపల్లితో 'మహర్షి', అనిల్ రావిపూడితో 'సరిలేరు నీకెవ్వరు' వంటి సినిమాలు చేసి హ్యాట్రిక్‌ విజయాలను నమోదు చేసుకున్నాడు. ఫలితంగా రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

విజయాల పరంపరతో యమ జోష్‌లో ఉన్న స్టార్ హీరో మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నాడు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం పెట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఆ తర్వాత మోసం చేసి విదేశాలకు పారిపోతోన్న బడా వ్యాపారవేత్తల కథతో ఈ సినిమాను సందేశాత్మకంగా రూపొందిస్తున్నట్లు ఎప్పుడో న్యూస్ లీకైంది. దీంతో మొదటి నుంచే ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మాస్ ఎలిమెంట్స్‌తో తీస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూట్‌ను కూడా పూర్తి చేసి.. విడుదలకు రెడీ చేస్తున్నారు.

Sarkaru Vaari Paata Ma Ma Mahesha Song on May 7th

హ్యాండ్సమ్ హీరో మహేశ్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న 'సర్కారు వారి పాట'కు సంబంధించిన షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ, ఈ చిత్రం నుంచి అప్‌డేట్లు పెద్దగా రాలేదు. దీంతో మహేశ్ ఫ్యాన్స్‌ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో గత ఏడాది ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని దీని నుంచి పాటలను వదలుతూ వచ్చారు. ఇందులో భాగంగానే ఇప్పటికే 'సర్కారు వారి పాట' మూవీ నుంచి కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్‌లను విడుదల చేశారు. వీటన్నింటికీ ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కింది. దీంతో ఇవన్నీ యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ను అందుకుని సత్తా చాటాయి.

'సర్కారు వారి పాట' మూవీని మే 12న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మే 7వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఇక, అదే రోజున అంటే మే 7న ఈ సినిమా నుంచి 'మ మ మహేశా' అంటూ సాగే ఓ మాస్ సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు చిత్ర యూనిట్ 'మహేశ్ బాబు, కీర్తి సురేష్ మాస్ మూమెంట్లతో రెడీగా ఉన్నారు. ఈ సీజన్‌లోనే ఫుల్ మాస్ సాంగ్ మే 7న విడుదల కాబోతుంది' అని ట్వీట్ చేసింది. అంతేకాదు, దీనితో పాటు ఓ మాస్ స్టెప్‌తో కూడిన పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.

క్రేజీ కాంబోలో రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీలో మహేశ్‌కు జోడీగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో సముద్రఖని, జగపతిబాబు సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X