For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ma Ma Mahesha: మహేశ్ మరో ఆల్‌టైం రికార్డు.. ఏకంగా 5 కోట్లతో నెంబర్ వన్ స్థానం

  |

  సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు బడా హీరో మహేశ్ బాబు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకుని స్టార్‌గా ఎదిగిన అతడు.. ఆ మధ్య భారీ డిజాస్టర్లను చవి చూశాడు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి బ్లాక్‌బస్టర్ హ్యాట్రిక్ విజయాలను దక్కించుకున్నాడు. ఈ జోష్‌తోనే మహేశ్ ఇటీవలే 'సర్కారు వారి పాట' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురాం పెట్ల తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి స్పందన దక్కింది.

  Nandini Reddy Shocking Comments On Mahesh Babu | Telugu Filmibeat

  Ashu Reddy: అషు రెడ్డి వీడియోపై ట్రోల్స్.. అది తీసేసి చూపించు అంటూ దారుణంగా!

  పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'సర్కారు వారి పాట' మూవీ భారీ అంచనాల నడుమ మే 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు రేంజ్‌కు తగ్గట్లుగానే చాలా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాకు ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, దానితో సంబంధం లేకుండా కలెక్షన్లు మాత్రం భారీ స్థాయిలో వచ్చాయి. ఫలితంగా మొదటి రోజు నుంచే ఈ చిత్రం బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తోంది. దీంతో దీనికి భారీ స్థాయిలో వసూళ్లు దక్కాయి. ఇప్పటికే ఈ సినిమా వంద కోట్ల షేర్‌ను కూడా అందుకుంది. తద్వారా చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా పూర్తి చేసుకుంది.

  సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ పరశురాం పెట్ల ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'సర్కారు వారి పాట' ఆల్బమ్‌కు భారీ రెస్పాన్స్ దక్కిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ చిత్రంలోని 'కళావతి' అంటూ సాగే సాఫ్ట్ మెలోడీ ఎన్నో రికార్డులను కూడా నమోదు చేసుకుంది. అలాగే, ఆ తర్వాత వచ్చిన 'పెన్నీ', టైటిల్ సాంగ్‌లు కూడా శ్రోతలను ఎంతగానో అలరించాయి. ఇక, ఈ సినిమాలోని 'మ మ మహేశా' అంటూ సాగే ఫాస్ట్ బీట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో ఈ సాంగ్ లిరికల్ వీడియోకు భారీ స్పందన దక్కింది. దీంతో రికార్డు స్థాయిలో వ్యూస్‌ను సొంతం చేసుకుని సత్తా చాటింది.

  హాట్ డోస్ పెంచేసిన అనన్య నాగళ్ల: ఆ పార్టును హైలైట్ చేస్తూ యమ ఘాటుగా!

  'మ మ మహేశా' సాంగ్‌కు థియేటర్లలో మహేశ్ బాబు అభిమానుల నుంచే కాకుండా సామాన్య ప్రేక్షకుల నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక, యూట్యూబ్‌లో అయితే ఈ సాంగ్ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ పాట యాభై మిలియన్ వ్యూస్ మార్కును కూడా చేరుకుంది. తద్వారా వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న లిరికల్ సాంగ్‌గా ఇది టాలీవుడ్‌లో ఆల్‌టైం రికార్డును నమోదు చేసుకుంది. ఇదిలా ఉండగా.. 'మ మ మహేశా' సాంగ్‌ను థమన్ కంపోజ్ చేయగా.. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. శ్రీకృష్ణ, జోనితా గాంధీ ఈ పాటను ఆలపించారు. ఇక, దీనికి ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశాడు.

   Sarkaru Vaari Paata Ma Ma Mahesha Song Reaches 50 Million Views

  మహేశ్ బాబు నటించిన తాజా చిత్రమే 'సర్కారు వారి పాట'. పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందించాడు. ఇందులో సముద్రఖని విలన్‌గా నటించారు. నదియా, సుబ్బరాజు, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు చేశారు.

  English summary
  Mahesh Babu Now Did Sarkaru Vaari Paata Movie under Parasuram Direction. This Movie Ma Ma Mahesha Song Reaches 50 Million Views.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X