Penny Song: సర్కారు వారి పాట నుంచి సర్‌ప్రైజ్.. ఆరోజే రెండో పాట రిలీజ్

అదిరిపోయే యాక్టింగ్, ఫైట్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని సక్సెస్‌కు చిరునామాగా మారాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో మహేశ్ బాబు వరుసగా 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి భారీ హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో మరింత ఉత్సాహంతో ఫ్యూచర్ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాడు.

విజయాల పరంపరతో యమ ఫామ్‌తో ఉన్న మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమా బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతోన్నట్లు వార్తలు వస్తున్నాయి. క్రేజీ కాంబినేషన్‌ కావడంతో ఈ మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను కమర్షియల్ హంగులతో కూడిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ మూవీని చిత్ర యూనిట్ ఎంతో ప్రతిష్టాత్మంగా తీస్తోంది.

భారీ బడ్జెట్‌తో మహేశ్ బాబు కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట'కు సంబంధించిన షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతోన్నా.. దీని నుంచి ఆ మధ్య టీజర్‌ను మాత్రమే విడుదల చేశారు. దీనికి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ టీజర్ టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను కూడా నమోదు చేసింది. దీని తర్వాత అంటే ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఫిబ్రవరి 14న 'కళావతి' అంటూ సాగే సాఫ్ట్ మెలోడీని వదిలారు. ఇది యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో రచ్చ చేసేస్తోంది. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది.

Sarkaru Vaari Paata Penny Song on March 20th

ఇక, 'సర్కారు వారి పాట' సినిమాలోని రెండో పాట గురించి చాలా రోజులుగా ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ దీని గురించి తాజాగా ఓ అధికారిక ప్రకటనను వదిలింది. ఇందులో రెండో పాటను మార్చి 20వ తేదీన విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాదు, ఇది 'పెన్నీ' అంటూ సాగే సాంగ్ అని కూడా పేర్కొన్నారు. ఇక, తాజాగా వదిలిన పోస్టర్‌లోనూ మహేశ్ బాబు లుక్ అదిరిపోయింది. కూలింగ్ గ్లాస్ పెట్టుకుని ఎంతో స్టైలిష్‌గా లుక్ ఇస్తోన్నాడతను. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఈ పాట కోసం ఇప్పటి నుంచే వేచి చూస్తున్నారు.

మహేశ్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోన్న విషయం తెలిసిందే. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుందని ప్రకటించారు. కానీ, అప్పటికి ఇది పూర్తయ్యే అవకాశాలు లేకపోవడంతో దీన్ని మే 12కు వాయిదా వేశారు. అందుకు అనుగుణంగానే ఈ మూవీ షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X