twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sarkaru Vaari Paata 11 ఏళ్లకే తమన్ తండ్రి బాధ్యత.. అనంత శ్రీరాం భావోద్వేగం

    |

    దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటించిన సర్కారు వారీ పాట చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో వంశీ పైడిపల్లి, సుకుమార్, మలినేని గోపిచంద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా..

    గేయ రచయిత అనంత్ శ్రీరాం మాట్లాడుతూ.. ఆరడుగుల అందగాడిని చూస్తే అబ్బాయిలు కూడా అసూయ పడుతారు. ఆయనతో ఏడుడుగు నడవడానికి కలలో కూడా ఆశపడుతుంటారో.. ఆ మొనగాడి మాటల కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు. ఇద్దరే ఇద్దరు గురించి మూడు మాటలు మాట్లాడి ముగిస్తాను అని అనంత్ శ్రీరాం అన్నారు.

    Sarkaru Vaari Paata Pre release event: Anantha Sreeram emotional about SS Thaman

    సర్కారు వారీ పాట సినిమాకు పాటలు రాసే ముందు నేను 1200 లకు పైగా పాటల్ని రాశాను. ఈ సినిమా కథ విన్నవెంటనే.. పొంగిపోయి.. దర్శకుడికి లొంగిపోయి.. ఆయన ముందు వంగిపోయి పాటలు రాశాను. రెండున్నర సంవత్సరాలు చెమటను రక్తంగా మార్చి.. రక్తాన్ని సిరాగా మాసి రాశాం. అందుకే మీరు మిలియన్ల వ్యూస్ అందించారు. నేను కొత్తగా ప్రయోగం చేయవచ్చా అంటే.. పరుశురాం ఒకటే మాట చెప్పేవారు. మీ అభిమాన హీరో గురించి మాట్లాడుతూ.. చేయండి.. మన హీరో బంగారం అని అన్నారు. దాంతో మేము గొప్పగా పనిచేయడంతో బంగారం లాంటి భవిష్యత్‌ను ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    తమన్ గురించి మీ అందరికి తెలుసు. ఆయన సాధిస్తున్న సంచలన విజయాలు చూశాం. ఆయన అందిస్తున్న పాటలు తెలుసు. తమన్ తన 11 ఏళ్ల వయసులోనే ఇంటికి తండ్రి బాధ్యతలు చేపట్టారు. ఆ కారణంగా ఆయనతో పనిచేసే వారిని ఫ్లయిట్‌లో తిప్పారు. ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉంచారు. ప్రతీ ఒక్కరిని తన బిడ్డగా చూసుకొనే వారు. అలాంటి వ్యక్తికి రాకుండా ఎవరికి విజయాలు వస్తాయి అని అనంత్ శ్రీరాం ఎమోషనల్ అయ్యారు.

    ఇక సర్కారు వారీ పాట ఎన్ని మిలియన్ల వ్యూస్ సాధించిందో.. అంతకంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపిస్తుంది అని మీ ముందు ఘంటాపదంగా చెబుతున్నాను అని అనంత్ శ్రీరాం అన్నారు.

    English summary
    Super star Mahesh Babu's Sarakaru Vaari Paata is set release on May 12th. In this occassion, Film unit organised the Pre release event at yousufguda police ground in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X