సర్కారు వారి పాట నుంచి మరో అదిరిపోయే సర్‌ప్రైజ్.. డేట్ ఫిక్స్?

సూపర్ స్టార్ మహేష్ బాబు సరికొత్త లుక్ తో వస్తున్న చిత్రం సర్కారు పాటపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాపై మొదటి నుంచి కూడా అభిమానుల్లో అంచనాలు స్థాయి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఫస్ట్ లుక్ టీజర్ ను చాలా తొందరగానే విడుదల చేసిన చిత్ర యూనిట్ ఆ తరువాత మాత్రం పాటల విషయంలో చాలా ఆలస్యం చేయాల్సి వచ్చింది. సినిమా విడుదల డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కో పాటను విడుదల చేయాలని అనుకున్నట్లుగా సంగీత దర్శకుడు థమన్ గతంలో వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి మొదటి సాంగ్ సోషల్ మీడియాలో మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది.

అభిమానులకు కూడా పాట చాలా బాగా నచ్చినట్లు ఉంది. కళావతి లిరికల్ సాంగ్ యూట్యూబ్ లో కూడా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం తో తరువాత రాబోయే పాటలు కూడా ఇంకా ఏ స్థాయిలో ఉంటాయో అనే తరహాలో కామెంట్స్ అయితే వస్తున్నాయి. సంగీత దర్శకుడు థమన్ ఇటీవల కాలంలో ఎలాంటి పాటను కంపోజ్ చేసిన కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక మహేష్ బాబు ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని మరికొన్ని పాటలను కంపోజ్ చేస్తున్నారట. సినిమా లోని ప్రతి పాట కూడా కథకు చాలా దగ్గరగా ఉంటాయట. కళావతి హిట్ అవ్వడంతో ఆ తరువాత రాబోయే పాట కూడా అంతకుమించి అనేలా ఉండాలి అని ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుకున్నారు.

sarkaru vaari paata second single release date fix

ఇక వారి అంచనాలను అందుకునే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. మరొక పాటను కూడా వీలైనంత త్వరగా విడుదల చేయాలని ఇటీవల చిత్ర యూనిట్ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రెండవ పాట కోసం డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. మార్చి 18వ తేదీన సర్కారు వారి పాట నుంచి అదిరిపోయే మరో లిరికల్ సాంగ్ వస్తుందని చెబుతున్నారు.. త్వరలోనే ఈ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ప్రస్తుతం సంగీత దర్శకుడు తమన్ సినిమాకు సంబంధించిన చివరి పాటను కంపోజ్ చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉంటాయట. ఆ పాటలకు ఇప్పటికే ట్యూన్స్ అన్ని రెడీ అయినట్లు తెలుస్తోంది. చివరి సాంగ్ మాత్రం అదిరిపోయేలా ఉండాలి అని కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు గా కూడా టాక్ వినిపిస్తోంది. ఇక రెండవ పాట మహేష్ బాబు అభిమానులకు విజిల్స్ వేయించేలా తరహాలో ఉంటుంది అని సమాచారం. కళావతి పాటలో మహేష్ బాబు స్టెప్పులు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే కీర్తి సురేష్ ఒకవైపు ట్రెడిషనల్ గా కనిపిస్తునే మరోవైపు ట్రెడిషనల్ లుక్ లో కూడా చాలా హాట్ గా కనిపించింది. వీరో తొలి కలయిక తో ఈ సినిమాకు ఒక సరికొత్త కళ ఏర్పడింది అని చెప్పవచ్చు. మహేష్ బాబు కీర్తి సురేష్ కు సంబంధించిన సన్నివేశాలు కూడా సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని దర్శకుడు పరశురామ్ చెబుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X