SVP Second Single: మహేశ్ ఫ్యాన్స్‌కు పండుగ కానుక.. రెండో పాట వచ్చేది ఆరోజే
అదిరిపోయే యాక్టింగ్‌తో పాటు హ్యాండ్సమ్ లుక్స్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా వెలుగొందుతోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కెరీర్ ఆరంభం నుంచీ చాలా హిట్లను అందుకున్న అతడు.. ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా భారీగా సంపాదించుకున్నాడు. దీంతో ఫలితాలతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే, ఆ మధ్య కొన్ని పరాజయాలతో ఇబ్బందులు పడ్డా.. ఇటీవలి కాలంలో 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్లను అందుకుని యమ జోష్‌తో ఉన్నాడు. ఈ ఉత్సాహంతోనే ఫ్యూచర్ ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకుంటూ దూసుకుపోతున్నాడు.
హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమా బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతోన్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్న విషయం తెలిసిందే. సినిమా కమర్షియల్ హంగులతో కూడిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీని చిత్ర యూనిట్ ఎంతో ప్రతిష్టాత్మంగా రూపొందిస్తోంది.

క్రేజీ కాంబినేషన్‌లో మహేశ్ బాబు కెరీర్‌లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సర్కారు వారి పాట'కు సంబంధించిన షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతోన్నా.. దీని నుంచి మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా 'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' పేరిట ఓ వీడియోను మాత్రమే విడుదల చేశారు. దీనికి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఈ టీజర్ టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను కూడా నమోదు చేసింది. దీని తర్వాత అంటే ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఫిబ్రవరి 14న 'కళావతి' అంటూ సాగే సాఫ్ట్ మెలోడీని వదిలారు. ఇది యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో రచ్చ చేసేస్తోంది.
'సర్కారు వారి పాట' మూవీలోని మొదటి పాట సూపర్ డూపర్ హిట్ అవడంతో.. ఇప్పుడు అందరి ఫోకస్ రెండో సాంగ్ మీద పడింది. ఈ నేపథ్యంలో ఇది ఫలానా రోజున రాబోతుందని జోరుగా ప్రచారం జరగడంతో పాటు కొన్ని డేట్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలోని రెండో పాటను హోళీ పండుగను పురస్కరించుకుని మార్చి 18వ తేదీన దీన్ని విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందని ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతుందని ప్రకటించారు. కానీ, అప్పటికి ఇది పూర్తయ్యే అవకాశాలు లేకపోవడంతో దీన్ని మే 12కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











