SVP Penny Song Promo: మొదటిసారి మహేష్ కూతురు కూడా.. స్టైలిష్ స్టెప్పులతో ఆదరగొట్టేశారు!
సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి రాబోతున్న తదుపరి సినిమా సర్కారు వారి పాటపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటపై ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయగా మరొక ఆసక్తికరమైన పాట ను కూడా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సిద్ధమయ్యారు. ఇక నేడు విడుదల చేసిన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే..

గ్యాప్ లేకుండా..
మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాను గత ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఆ కారణంగా సినిమాను వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇక ఫైనల్ గా సినిమా షూటింగ్ అయితే తుది దశకు చేరుకుంది. చిత్రం యూనిట్ సభ్యులు ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్ పనులు పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.

ఫస్ట్ సాంగ్ హిట్
ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించిన మహేష్ బాబు ఫస్ట్ లుక్ టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన కళావతి పాట కూడా సోషల్ మీడియా లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. యూట్యూబ్ లో ఇప్పటికే ఈ పాట 100 మిలియన్ వ్యూవ్స్ అందుకునేందుకు సిద్ధంగా ఉంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక మరొక ముఖ్యమైన పాటను కూడా విడుదల చేసేందుకు రెడీ అయ్యారు.

సితారా కూడా
కళావతి పాట సక్సెస్ కావడంతో నెక్స్ట్ మహేష్ బాబు క్యారెక్టర్ ను హైలెట్ చేసే విధంగా పాటను విడుదల చేయబోతున్నారు. పెన్ని సాంగ్ కు సంబంధించిన ప్రోమోలో మహేష్ బాబుతో పాటు సీతారా కూడా హైలెట్ గా నిలవడం విశేషం. ఇక ఆ పాటను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సీతారా స్టీలింగ్ ద షో అని వివరణ ఇచ్చారు. ఇక ఫుల్ సాంగ్ ను ఆదివారం రోజు విడుదల చేయబోతున్నారు.
మంచి మెస్సేజ్..
చూస్తుంటే సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం కాయంగా కనిపిస్తోంది. మహేష్ బాబును దర్శకుడు పరశురామ్ గతంలో ఎప్పుడు లేని విధంగా చాలా భిన్నంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో కమర్షియల్ అంశాలతో పాటు చివరలో ఒక మంచి సందేశం కూడా ఉంటుందట. ఇక కళావతి పాటు హిట్ అవ్వడంతో ఇప్పుడు పెన్నీ పాట కూడా హిట్ అవుతుంది అనేలా పాజిటివ్ టాక్ వినబడుతోంది.

రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ సినిమాలో ఆర్థిక నేరాల నేపథ్యంలో బ్యాంక్ కు సంబంధించిన మోసాలను హైలెట్ చేసి చూపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ అయితే చివరి దశలో ఉంది. మరో రెండు పాటలకు సంబంధించిన షూట్ ఫినిష్ కావాల్సి ఉంది. ఇక సినిమాను ఈ ఏడాది మె 12వ తేదీన విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











