Sarkaru Vaari Paata: మహేశ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. స్పీకర్స్ పగిలిపోవాల్సిందే
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా స్టార్ హీరోగా వెలుగొందుతూ.. క్రమంగా తన మార్కెట్‌ను భారీగా పెంచుకుంటోన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్‌తో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో కొరటాల శివతో 'భరత్ అనే నేను', వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి', అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని ప్రాజెక్టులను చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.
వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తోన్నాడు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం పెట్ల రూపొందిస్తోన్న ఈ చిత్రం.. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఆ తర్వాత మోసం చేసి విదేశాలకు పారిపోతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని పక్కా కమర్షియల్ మూవీగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది.

మహేశ్ బాబు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'సర్కారు వారి పాట'కు సంబంధించిన షూటింగ్ ప్రారంభమై చాలా రోజులే అవుతున్నాయి. కానీ, ఈ చిత్రం నుంచి గత ఏడాది 'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' పేరిట ఓ టీజర్ వీడియోను మాత్రమే వదిలారు. ఆ తర్వాత చాలా కాలం పాటు గ్యాప్ తీసుకోవడంతో మహేశ్ బాబు అభిమానులు చిత్ర యూనిట్‌పై విమర్శలు చేశారు. దీంతో గత ప్రేమికుల రోజును పురస్కరించుకుని గత ఫిబ్రవరి 14న 'కళావతి' అంటూ సాగే సాఫ్ట్ మెలోడీని వదిలారు. ఇది యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. అలాగే, ఇటీవలే 'పెన్నీ' అనే సాంగ్‌ను కూడా రిలీజ్ చేయగా ఇది కూడా హిట్ అయింది.
మొదటి రెండు పాటలకు శ్రోతల నుంచి ఊహించని స్పందన దక్కడంతో 'సర్కారు వారి పాట' నుంచి మూడో పాటను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఇందులో భాగంగానే ఏప్రిల్ 23న ఉదయం 11:07 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, 'ఈ సారి స్పీకర్లు పగిలిపోవడం ఖాయం' అంటూ అందరిలో అంచనాలు కూడా పెంచేశారు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఇప్పటి నుంచే ఈ పాట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న 'సర్కారు వారి పాట' మూవీలో మహేశ్‌కు జోడీగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో సముద్రఖని, జగపతిబాబు సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఈ మూవీని మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











