Sarkaru Vaari Paata: మోత మోగేలా టైటిల్ సాంగ్.. మహేశ్ ఫ్యాన్స్‌కు అదిరే ట్రీట్

సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు హ్యాండ్సమ్ హీరో మహేశ్ బాబు. చిన్న వయసులోనే తనదైన శైలి యాక్టింగ్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన అతడు.. తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతోన్నాడు. అదే సమయంలో ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇలా ఈ మధ్య కాలంలో వరుసగా 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్లతో హ్యాట్రిక్‌ను నమోదు చేసుకున్నాడు. ఫలితంగా రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్నాడు.

హిట్లు మీద హిట్లు కొడుతూ సూపర్ ఫామ్‌లో ఉన్న స్టార్ హీరో మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. దీన్ని కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన పరశురాం పెట్ల తెరకెక్కిస్తున్నాడు. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోతోన్న బడా వ్యాపారవేత్తల కథతో ఈ సినిమాను సందేశాత్మకంగా రూపొందిస్తున్నట్లు ఆరంభం నుంచే ప్రచారం జరుగుతోంది. దీంతో మొదటి నుంచే ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూట్ కూడా పూర్తైన విషయం తెలిసిందే.

Sarkaru Vaari Paata Title Song Released

సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'సర్కారు వారి పాట'కు సంబంధించిన షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ, ఈ చిత్రం నుంచి గత ఏడాది 'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' పేరిట ఓ టీజర్ వీడియోను మాత్రమే వదిలారు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకోవడంతో మహేశ్ బాబు అభిమానుల నుంచి తీవ్ర అభ్యంతరాలు ఎదురయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా మ్యూజిక్ ఫీస్ట్‌లో భాగంగా గత ప్రేమికుల రోజును పురస్కరించుకుని గత ఫిబ్రవరి 14న 'కళావతి' అంటూ సాగే సాఫ్ట్ మెలోడీని వదిలారు. ఇది యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది. అలాగే, ఇటీవలే 'పెన్నీ' అనే సాంగ్‌ను కూడా రిలీజ్ చేయగా ఇది కూడా స్పందనను అందుకుంది.

'సర్కారు వారి పాట' నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ దక్కడంతో చిత్ర యూనిట్ ఇప్పుడు మూడో పాటను కూడా విడుదల చేసింది. ముందుగానే ప్రకటించినట్లుగా ఏప్రిల్ 23న ఉదయం 11:07 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. 2.43 నిమిషాల నిడివితో ఉన్న ఈ పాటను ఎస్ థమన్ కంపోజ్ చేయగా.. అనంత్ శ్రీరామ్ దీనిని రచించారు. ఇక, హారిక నారాయనన్ ఈ పాటను అద్భుతంగా ఆలపించారు. ఇందులో చూపించిన విజువల్స్ బాగున్నాయి. మొత్తంగా ఈ పాటతో థమన్ మరోసారి మోత మోగించాడని చెప్పుకోవచ్చు.

భారీ బడ్జెట్‌తో రాబోతున్న 'సర్కారు వారి పాట' మూవీలో మహేశ్‌కు జోడీగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో సముద్రఖని, జగపతిబాబు సహా ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ మూవీని మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X