Sarkaru Vaari Paata నుంచి ఉగాది కానుక: అదే సర్‌ప్రైజ్ రాబోతుందట
సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో టాలీవుడ్‌లో బడా హీరోగా ఎదిగిపోయాడు మహేశ్ బాబు. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అతడు.. స్టార్‌డమ్‌ను అందుకోవడంతో పాటు మార్కెట్‌ను కూడా భారీ స్థాయిలో పెంచుకున్నాడు. అందుకే ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇలా ఈ మధ్య కాలంలో మహేశ్ బాబు వరుసగా 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు' వంటి సూపర్ డూపర్ హిట్లను అందుకుని యమ జోష్‌తో ఉన్నాడు.
వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ యమ ఉత్సాహంతో ఉన్న మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమా బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోతోన్న బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతోన్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్న విషయం తెలిసిందే. సినిమా కమర్షియల్ హంగులతో కూడిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీని చిత్ర యూనిట్ ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తోంది.
మహేశ్ బాబు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'సర్కారు వారి పాట' మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతోన్నా.. దీని నుంచి అప్‌డేట్లు పెద్దగా రాలేదనే చెప్పాలి. గత ఏడాది మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా 'సర్కారు వారి పాట బర్త్‌డే బ్లాస్టర్' పేరిట ఓ వీడియోను మాత్రమే విడుదల చేశారు. దీనికి ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీని తర్వాత అంటే ప్రేమికుల రోజును పురస్కరించుకుని ఫిబ్రవరి 14న 'కళావతి' అంటూ సాగే సాఫ్ట్ మెలోడీని వదిలారు. ఆ తర్వాత 'పెన్నీ' అంటూ సాగే పాటనూ వదిలారు. ఇవి కూడా రికార్డులు క్రియేట్ చేశాయి.

క్రేజీ కాంబోలో రూపొందుతోన్న 'సర్కారు వారి పాట' మూవీలోని రెండు పాటలు సూపర్ డూపర్ హిట్ అవడంతో.. ఇప్పుడు అందరి ఫోకస్ మూడో సాంగ్ మీద పడింది. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలోని మూడో పాటను ఉగాది పండుగను పురస్కరించుకుని ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన ప్రకటన ఇవాళో, రేపో రాబోతుందని ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇక, ఈ పాట ఫుల్ మాస్ బీట్‌తో సాగేదిగా ఉంటుందని కూడా ఓ వార్త బయటకు వచ్చింది.
మహేశ్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' మూవీలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్నాడు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.


Click it and Unblock the Notifications











