Satyabhama Music Review ట్రెండింగ్‌లో సత్యభామ సాంగ్స్.. కాజల్ అగర్వాల్ సాంగ్స్ లిరిక్ మీకు కావాలా?
అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా సుమన్ చిక్కాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సత్యభామ. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్‌గా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. యువ హీరో నవీన్ చంద్ర తదితరులు నటిస్తున్నారు. అయితే మే 31వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల విడుదల చేసిన పాటలు సోషల్ మీడియా, యూట్యూబ్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఆ పాటల వివరాల్లోకి వెళితే..
సత్యభామ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల గిల్లి గిలక, వెతుకు వెతుకు అనే పాటలను రిలీజ్ చేశారు. ఈ రెండు పాటకు కూడా భారీగా స్పందన సంగీత ప్రియుల నుంచి వస్తున్నది. ఈ రెండు పాటలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఈ చిత్రంలోని మొదటి సింగిల్ కళ్లారా అనే పాటను రాంబాబు గోసాల రాయగా. శ్రేయా ఘోషల్ ఆలపించారు. ఈ పాటకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
కళ్లారా చూశాలే..
నావేనా నువ్వేనా?
గుండెల్లో దాచేనా
నిన్నేనా నా నిన్నేనా..
నీ ఊహల గుసగుసల పదనిసలై
ఉయ్యాలే ఊపేయనా..
నీ ఊసుల మధురిమ
హృదయమనే..
మైకంలో ముంచేసేనా
గ రి ని ద.. గ ని స స
మ ద ని స.. రి గ గ అనే మెలోడీగా సాగే పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకొంటున్నది.

ఇక సత్యభామలోని రెండో సింగిల్ విషయానికి వస్తే.. వెతుకు వెతుకు పాటను ఇటీవల మ్యూజికల్ ఈవెనింగ్ ఈవెంట్‌లో రిలీజ్ చేశారు. ఈ పాటకు కూడా మంచి స్పందన లభిస్తున్నది. ఈ పాటను ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పాడటం విశేషం. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. అమ్మాయిలపై జరుగుతున్న హత్యాయత్నాల నేపథ్యంలో..బాధిత యువతులను చూసి చలించిపోతుంది పోలీస్ ఆఫీసర్ సత్యభామ. ఆ నేరస్తులను పట్టుకోవడానికి సిద్ధమవుతుంది. ఆ సందర్భంలో వచ్చే పాట ఇది.
వెతుకు వెతుకు వెతుకు
వెనుదిరగకుండా వెతుకు
వెతుకు వెతుకు వెతుకు
వెనుకాడకుండా వెతుకు
ఆశ కొరకు నిరాశలోని వెతుకు
కాంతి కోసం నిశిధిలోనే వెతుకు
ఉండాల్సిన దాన్నే పోయిన చోటే వెతుకు
వెతుకు వెతుకు వెతుకు అంటూ సాగే పాటను మహిళలను చైతన్య పరిచే విధంగా చిత్రీకరించారు. ఈ పాటకు చార్ట్ బస్టర్లలో టాప్ ప్లేస్‌ను సొంతం చేసుకొన్నది.


Click it and Unblock the Notifications











