ట్రెండింగ్‌లో సత్యభామ ఎమోషనల్ సాంగ్.. కాజల్ అగర్వాల్‌పై పవర్ ఫుల్‌గా!
ప్రముఖ దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పణలో ఆరమ్ ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం సత్యభామ. యువ దర్శకుడు సుమన్ చిక్కాల డైరెక్షన్‌లో క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర జంటగా రూపొందిన ఈ చిత్రం ఇటీవల రిలీజై బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. అయితే ఈ సినిమా పాటలు మాత్రం ఇంకా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచాయి. తాజాగా అండర్ ది బ్లూ స్కైస్ అనే పాట మాత్రం యూట్యూబ్‌లో సందడి చేస్తున్నది. ఆ పాట వివరాల్లోకి వెళితే..
సత్యభామ సినిమాకు థీమ్ సాంగ్‌గా రూపొందిన ఈ పాట సిచ్చువేషన్‌గా వచ్చే గేయంగా రూపొందించారు. కాజల్‌పై మాంటేజ్ సాంగ్‌గా చిత్రీకరించారు.మంచి సాహిత్యంతో ఈ పాట సాగిన విధానం ఇలా ఉంది..

అండర్ ది బ్లూ స్కైస్..
స్మెల్ ది ఓషియన్ వేవ్స్
ఫీల్ లైక్ అనదర్ డే
అనందర్ వికెడ్ లూస్
ఫీలింగ్ ఆఫ్ సాల్వేషన్
స్టంగ్ ఇంటూ మై మైండ్ అంటూ ఆంగ్ల సాహిత్యంతో సాగే ఈ పాట చాలా ఎమోషనల్‌గా ఆకట్టుకొనేలా ఉంటుంది. మహిళలపై జరిగే దౌర్జన్యాలపై అధికారికి ఎదురయ్యే సవాళ్ల గురించి చెప్పే విధంగా ఈ పాటను చిత్రీకరించారు.

ఈ పాటకు శ్రీచరణ్ పాకాల సాహిత్యం అందించగా.. ముర్తాజా అబ్బాస్ కురసానీ సాహిత్యం అందించారు. ఈ పాటను దేవీక ఎస్, ముర్తాజా అబ్బాస్ కురసాని, క్రాంతి కిరణ్ కుమార్ ఆలపించారు. ఈ పాటను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య మ్యూజిక్ ఆడియోను మార్కెట్‌లోకి తెచ్చింది.
ఇక సత్యభామ సినిమా విషయానికి వస్తే. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ చిత్రానికి బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కళ్లపల్లి నిర్మాతలుగా వ్యవహరించారు. సినిమాటోగ్రాఫర్‌గా విష్ణు బేసి, ఎడిటర్‌గా పవన్ కల్యాణ్ కోదాటి వ్యవహరించారు.


Click it and Unblock the Notifications











