‘సత్యమేవ జయతే’.. ‘వకీల్ సాబ్’ పాటపై తమన్ పోస్ట్ వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రచ్చ మళ్లీ షురూ అయింది. ముందుగా చెప్పినట్టుగానే మార్చి నెల మొత్తం మ్యూజిక్ ఫెస్ట్ ఉండబోతోంది. వకీల్ సాబ్ సినిమాలోని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేయబోతోన్నామని గత నెల ప్రకటించారు. ఈ మేరకు అన్నీ షెడ్యూల్స్ చేసేశామని చిత్రయూనిట్, తమన్ పేర్కొన్నారు. అయితే అప్పుడు చెప్పినట్టుగానే తాజాగా ఓ అప్డేట్ ఇచ్చారు. రేపు సాయంత్రం వకీల్ సాబ్ నుంచి ఓ లిరికల్ వీడియోను విడుదల చేయబోతోన్నట్టు తెలిపారు.

గతేడాది మహిళల దినోత్సవం సందర్భంగా మగువా మగువా అనే పాటను విడుదల చేయగా అది ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. అయితే తాజాగా మరో పాటను రిలీజ్ చేసి వకీల్ సాబ్ మీద అంచనాలు పెంచేయాలని చిత్రయూనిట్ ప్లాన్ వేసింది. దానికి తగ్గట్టుగా సత్యమేవ జయతే అనే ఈపాటను రేపు సాయంత్రం విడుదల చేయబోతోన్నట్టు తెలిపారు. మార్చి 3న సాయంత్రం ఐదు గంటలకు సత్యమేవజయతే అనే పాట విడుదల కాబోతోంది.

Satyamev Jayate Song from Pawan Kalyan Vakeel Saab on 3rd March

ఇష్టం, గౌరవం అన్నీ కలిసి రాసిన పాట అంటూ రామ జోగయ్య శాస్త్రి చెప్పుకొచ్చాడు. ఇక కొన్నేళ్ల పాటు ఈ పాట మిమ్మల్ని వదిలి పెట్టి పోదంటూ తమన్ హైప్ పెంచేస్తున్నాడు. మొత్తానికి వకీల్ సాబ్ సినిమా మీదున్న అంచనాలు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. మరీ రేపు ఈ సాంగ్ విడుదలైతే టాక్ ఎలా ఉంటుందో చూడాలి. ఏప్రిల్ 9న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X