అదరగొట్టేసిన తమన్.. దూసుకుపోతోన్న ‘సత్యమేవ జయతే’

తమన్ ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉన్నాడు. ఆయన కొట్టిన ప్రతీ ట్యూన్ హిట్ అవుతోంది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోలకు ఇప్పుడు హాట్ ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. అందులోనూ తమన్‌ తనకు ఇష్టమైన హీరోలకు ప్రత్యేకంగా బాణీలను అందిస్తుంటాడు. అలాంటి తమన్ తన ఫేవరేట్ హీరోకు ఇంకెలాంటి ట్యూన్స్ ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు తమన్ ఓకే అయినప్పటి నుంచి అందరికీ అంచనాలు ఓ రేంజ్‌లోఉన్నాయి.

వాటికి తగ్గట్టే తమన్ మగువా మగువా అనే సాంగ్‌ను అందించాడు. ఆ పాటకు అందరూ ఫిదా అయ్యారు. అయితే మళ్లీ ఇన్ని రోజులకు వకీల్ సాబ్ నుంచి మరో పాట బయటకు వచ్చింది. సత్యమేవ జయతే అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతూ వచ్చింది. మొత్తానికి కాసేపటి క్రితమే సత్యమేవ జయతే అనే పాట విడుదలైంది. విడుదలైన కొద్దిక్షణాల్లోనే వకీల్ సాబ్, సత్యమేవ జయతే అనే రెండు కూడా ట్విట్టర్‌లో దేశ వ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి.

Satyamev Jayate Song Goes viral from Pawan Kalyan Vakeel Saab

శంకర్ మహదేవన్ గాత్రం, రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం కలిసి పాటను ఎక్కడో నిలబెట్టేశాయి. తమన్ కొట్టి మ్యూజిక్ మాత్రం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. మొత్తంగా పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు ఈ పాట విజువల ట్రీట్‌లా ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. నిజ జీవితంలో పవన్ కళ్యాణ్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ పాట రాసి ఉంటారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 9న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X