SP Balasubrahmanyam: బాలు ప్రపంచ రికార్డు.. ఇలా చేసిన ఏకైక వ్యక్తి.. అసలు నిజాలు తెలిస్తే!

సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో తిరుగులేని గాయకుడిగా వెలుగొందారు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. అద్భుతమైన గాత్రంతో ఎన్నో ఏళ్ల పాటు సంగీత ప్రియులను అలరించిన ఆయన.. సుమారు నలభై వేలకు పైగా పాటలను ఆలపించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. దేశంలోని ఎన్నో భాషల్లో ఆయన గొంతును వినిపించారు.

ఈ క్రమంలోనే ఎన్నో మైలురాళ్లను చేరుకోవడంతో పాటు అవార్డులు, రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. ఈరోజు ఎస్పీ బాలసుబ్రమణ్యం వర్దంతి. ఈ సందర్భంగా ఆయన జీవితంలోని కొన్ని ఘనతలను గుర్తు చేసుకుందాం!

SBP lives on: SP Balasubrahmanyam Records and Awards Details

ఎస్పీ బాలు కుటుంబ నేపథ్యం: నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో సాంబమూర్తి, శకుంతలమ్మ దంపతులకు ఎస్పీ బాలసుబ్రమణ్యం 1946 జూన్ 4న జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, నాలుగు చెల్లెలు. అందులో గాయని ఎస్పీ శైలజ, ఎస్పీ వసంత కూడా తెలుగు వాళ్లకు పరిచయం ఉన్నవాళ్లే. ఎస్పీ బాలు వివాహం సావిత్రితో జరిగింది. ఆయనకు పల్లవి, ఎస్పీ చరణ్ సంతానం ఉన్నారు.

SBP lives on: SP Balasubrahmanyam Records and Awards Details

సినిమాల్లోకి అలా ప్రవేశించారు: మద్రాసులో ఏఎమ్ఐఈ చదువుతున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసారు. 1966లో 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' అనే చిత్రం ద్వారా సింగర్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆరంభంలోనే ఎంతగానో ఆకట్టుకున్న ఎస్పీబీ.. మంచి గుర్తింపును అందుకున్నారు. ఆ తర్వాత తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడారు.

SBP lives on: SP Balasubrahmanyam Records and Awards Details

అలా చేసిన ఒకే ఒక్కరు బాలు: సింగర్‌గా వేల పాటలను పాడిన ఎస్పీ బాలసుబ్రమణ్యం.. డబ్బింగ్ ఆర్టిస్టుగానూ మంచి గుర్తింపును అందుకున్నారు. 'మన్మధలీలై' చిత్రంతో డబ్బింగ్ ఆర్టిస్టుగా సత్తా చాటారు. సుదీర్ఘమైన ప్రయాణంలో కమల్ హాసన్, రజనీకాంత్, విష్ణువర్ధరణ్, సల్మాన్ఖాన్, కే భాగ్యరాజా, అనిల్ కపూర్, గిరీష్ కర్నాడ్, జెమిని గణేషన్, అర్జున్ సర్జా, రఘువరన్ వంటి నటులకు డబ్బింగ్ ఇచ్చారు.

SBP lives on: SP Balasubrahmanyam Records and Awards Details

నటుడిగానూ సత్తా చాటారుగా: 1969లో వచ్చిన 'పెళ్లంటే నూరేళ్ల పంట' అనే చిత్రం ద్వారా బాలసుబ్రమణ్యం నటుడిగా తన ప్రయాణం ప్రారంభించారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన పాత్రలను పోషించారు. ఈ క్రమంలోనే పలుమార్లు ఉత్తమ సహాయ నటుడిగానూ నిలిచారు. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో గొప్ప గొప్ప పాత్రలను చేశారు. చివరిగా ఎస్పీ బాలు 'దేవదాస్' చిత్రంలో కనిపించారు.

కొత్త టాలెంట్‌కు ప్రోత్సాహం: టాలెంట్ ఉండి అవకాశాలు దొరకని ఎంతో మందికి మార్గం చూపాలన్న లక్ష్యంతో బుల్లితెరపై పలు పాటల కార్యక్రమాలను సైతం ప్రారంభించారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఈ క్రమంలోనే తన శిష్యులుగా ఎంతో మందిని తయారు చేసి సినీ పరిశ్రమకు అందించారు. ఆయన అడుగు జాడల్లో నడిచిన ఎంతో మంది ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ సింగర్లుగా దూసుకెళ్తున్నారు.

SBP lives on: SP Balasubrahmanyam Records and Awards Details

లెక్కలేని అవార్డులు సొంతం: తన సినీ ప్రస్థానంలో గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటుడిగా మెప్పించారు బాలసుబ్రమణ్యం. ఈ క్రమంలోనే ఎన్నో రకాల అవార్డులు దక్కించుకున్నారు. సినీ రంగానికి సంబంధించి పలు రాష్ట్రాలు ఇచ్చే అత్యున్నత అవార్డులను తీసుకున్న ఆయన.. 'ఏక్ దూజే కే లియే', 'సాగర సంగమం', 'స్వాతిముత్యం', 'రుద్రవీణ' చిత్రాలకు జాతీయ అవార్డులు అందుకొన్నారు.

బాలసుబ్రమణ్యం వరల్డ్ రికార్డ్: దాదాపు నలభై ఏళ్ల పాటు ఎన్నో రకాలుగా మెప్పించి చిరకాలం గుర్తుండిపోయేలా కీర్తి ఘడించారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఈ క్రమంలోనే 11 భాషల్లో కలిపి 40 వేల పాటలు పాడారు. అదే సమయంలో 40 సినిమాలకు మ్యూజిక్ అందించి ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఈ క్రమంలోనే ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచే ఏకంగా 29 నంది అవార్డులను దక్కించుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X