సమంత, నాగ చైతన్య 'మజిలీ' నుంచి సెకండ్ సాంగ్.. ఆకట్టుకునేలా మెలోడీ!
రియల్ లైఫ్ కపుల్స్ అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటిస్తున్న చిత్రం మజిలీ. వివాహం తర్వాత వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో వీరిద్దరూ భార్య భర్తలుగానే నటిస్తున్నారు. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శత్వంలో రూపొందుతోంది. ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. నాగ చైతన్య యంగ్ లుక్‌లో క్రికెటర్ గా కనిపిస్తున్నాడు. గడ్డం లుక్ లో సమంతకు భర్తగా కూడా కనిపిస్తున్నాడు.
ఈ చిత్రంలో చైతు పాత్రలో రెండు వేరియేషన్స్ ఉన్నాయని అర్థం అవుతోంది. ఏప్రిల్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. దీనితో ప్రమోషన్ కార్యక్రమాలు జోరందుకున్నాయి. తాజాగా ఈ చిత్రంలోని సాంగ్‌ని విడుదల చేశారు. ప్రియతమా ప్రియతమా అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ వినసొంపైన సంగీతంతో ఆకట్టుకునే విధంగా ఉంది.

మజిలీ చిత్రానికి గోపి సుందర్ సంగీత దర్శకుడు. ఈ పాటని చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించారు. చిన్మయి శ్రీపాద ఈ పాటకి తన గాత్రాన్ని అందించింది. మజిలీ చిత్రంలో మరో హీరోయిన్ గా దివ్యాన్ష కౌషిక్ నటిస్తోంది. షైన్ స్క్రీన్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంత, చైతులది సూపర్ హిట్ కాంబినేషన్ కావడంతో మజిలీ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.


Click it and Unblock the Notifications











