వాల్మీకి నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్.. 'గగన వీధిలో' అంటూ సూపర్బ్ ట్యూన్
హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా 'వాల్మీకి'. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. తమిళ నటుడు అథర్వా మురళి విలన్‌గా కనిపించనున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ' సినిమాకి రీమేక్ గా వాల్మీకి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన యూనిట్ సభ్యులు చిత్రంలోని సెకండ్ లిరికల్ సాంగ్ కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు.
'గగన వీధిలో' అంటూ మెలోడీ ట్యూన్‌లో సాగిపోతున్న ఈ పాట ఎంతో వినసొంపుగా ఉండి ఆకట్టుకుంటోంది. వనమాలీ అందించిన లిరిక్స్‌పై మిక్కీ జె మేయర్ లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ లిరికల్ సాంగ్ లో అథర్వా మురళి, మృణాళిని రవి లను చూపించడం గమనించదగిన విషయం. ఈ సాంగ్ ద్వారా క్లాస్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు.

ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనుండగా ఆయన సరసన పూజా హెగ్డే మరింత డిఫెరెన్ట్ రోల్ లో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన అన్ని అప్‌డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేయడంతో వాల్మీకి పట్ల మెగా అభిమానుల్లో ఆత్రుత నెలకొంది.


Click it and Unblock the Notifications











