వాళ్లందరికీ ఈ సాంగ్ అంకితం.. హాలోగురు ప్రేమ కోసమే రెండవ పాటకు ముహూర్తం!
హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం హలొ గురు ప్రేమ కోసమే. నేను లోకల్ ఫేమ్ త్రినాథ్ రావు నక్కిన దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో హీరోయిన్. ఇటీవల విడుదల చేసిన టీజర్, ఫస్ట్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హుషారెత్తించే రెండవ పాటని అక్టోబర్ 6న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు.
ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దేవిశ్రీ సెకండ్ సాంగ్ గురించి ట్వీట్ చేస్తూ ఆసక్తికర విశేషాలు వెల్లడించాడు. నేటివ్ ప్లేస్ అనే పదంతో ఈ పాట ఉండనుంది. నేటివ్ ప్లేస్ ని మిస్ అవుతున్న అందరికి ఈ పాట అంకితం అని దేవిశ్రీ ట్వీట్ చేశాడు.
అక్టోబర్ 18 న దసరా కానుకగా హాలోగురు ప్రేమకోసమే చిత్రం విడుదల కానుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రం తరువాత మరోమారు అనుపమ, రామ్ ఈ చిత్రంలో నటిస్తున్నారు.



Click it and Unblock the Notifications











