పెళ్లి గెటప్పుల్లో వెంకీ, తమన్నా.. ఆకట్టుకుంటున్న దేవిశ్రీ మెలోడీ సాంగ్!
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్2. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని దర్శకుడు. వినోదాత్మక చిత్రాలని తెరకెక్కించడంలో అనిల్ రావిపూడికి మంచి పట్టుంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సారి అనిల్ రావిపూడి కామెడీ ప్రధాన అంశంగా ఎఫ్2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఎఫ్2 టీజర్ చూస్తుంటే ఈ సంక్రాంతికి తోడల్లుళ్లుగా వస్తున్న వెంకీ, వరుణ్ తేజ్ రచ్చ ఏవిధంగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.
సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ మొదలు పెట్టింది. తాజాగా ఈ చిత్ర రెండవ పాటని విడుదల చేశారు.
రెచ్చిపోదాం బ్రదర్ అంటూ సాగే తొలి పాట మాస్ బీట్ తో అలరించింది. రెండవ పాట కోసం దేవిశ్రీమంచి మెలోడీ ట్యూన్ అని అందించారు. ఎంతో ఫన్ అంటూ సాగే ఈ పాట వినసొంపుగా ఉంది. ఈ పాటకు శ్రీమణి సాహిత్యాన్ని అందించాడు. సంగీత దర్శకుడు దేవిశ్రీనే పాడాడు.

తమన్నా, వెంకీ మధ్య జరిగే పెళ్లి సీన్, కొత్త కాపురం నేఅప్థ్యంలో ఈ పాట ఉండనున్నట్లు లిరికల్ వీడియో ద్వారా అర్థం అవుతోంది. తమన్నా, వెంకీ ఈ పాటలో రొమాంటిక్ స్టెప్పులతో అలరించనున్నారు. దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











