అరవింద సమేత చిత్రంతో సెంచరీ.. దూసుకుపోతున్నాడుగా!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో త్రివిక్రమ్ మరోమారు జూలు విదిల్చాడు. ఎన్టీఆర్ స్టామినాతో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది.
ఈ చిత్ర విజయంలో సంగీత దర్శకుడు తమన్ పాత్ర మరువలేనిది. సినిమాకు అవసరమైన అద్భుతమైన బ్యాగ్రౌండ్ సంగీతాన్ని అందించాడు. అలాగే నాలుగు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ సన్నివేశాల్లో, ఎమోషనల్ సన్నివేశా లు తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో మరో స్థాయికి చేరాయి.

ఇదిలా ఉండగా అరవింద సమేత చిత్రంతో తమన్ 100 చిత్రాలు పూర్తి చేసుకున్నాడు. ఏ విషయాన్ని తమన్ ట్విటర్ ద్వారా తెలియజేశాడు. ఎన్టీఆర్ నటించిన సినిమాతో తాను 100 పూర్తి చేయడం సంతోషంగా ఉందని తెలిపాడు.
More from Filmibeat
thaman asvr aravindha sametha pre release event aravindha sametha jr ntr ntr trivikram srinivas pooja hegde eesha rebba అరవింద సమేత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పూజ హెగ్డే


Click it and Unblock the Notifications











