షాకింగ్: 24 గంటల్లో 24 మిలియన్లు.. సల్మాన్ ఖాన్, షారుక్ మ్యాజిక్.. యూట్యూబ్‌లో వైరల్!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన జీరో చిత్రం రిలీజ్‌కు ముందే భారీ క్రేజ్‌ను సంపాదించుకొన్నది. ఇటీవల విడుదలైన టీజర్లు, ట్రైలర్లు పాటలకు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. తాజాగా జీరో సినిమాకు సంబంధించిన రెండో పాటను విడుదల చేయగా ఇంటర్నెట్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పాట ఏమిటంటే..

య్యూట్యూబ్‌లో ట్రెండింగ్
జీరో చిత్రంలో కండలవీరుడు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్‌పై చిత్రీకరించిన ఇసాక్‌బాజీ పాటను విడుదల చేయగా యూట్యూబ్, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పాట 24 గంటల్లో 24 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇంకా భారీ వ్యూస్‌ను సాధిస్తున్నది. ప్రస్తుతం 25,439,376 వ్యూస్‌తో దూసుకెళ్తున్నది.

సల్మాన్ ఖాన్‌తో షారుక్ ఖాన్
ఇసాక్‌బాజీ పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో సాగే పాట. ఈ పాటను బావ్ సింగ్ పాడారు. సల్మాన్ ఖాన్‌తో డ్యాన్స్ చేస్తూ తన ప్రేయసి బబితా కుమారి (కత్రినా కైఫ్)పై ప్రేమను వ్యక్తీకరిస్తూ సాగిన పాట దేశీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నది.
నంబర్ వన్ స్ఠానంలో
ఇసాక్ బాజీ పాటలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ బ్రొమాన్స్, స్టెప్పులు ఆకట్టుకొన్నాయి. ఈ పాటను డిసెంబర్ 4న విడుదల చేయగా.. య్యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. పాట విడుదలైన ఐదు నిమిషాల్లోనే #IssaqbaaziOutNow అనే హ్యాష్ ట్యాగ్ యూట్యూబ్‌లో నంబర్‌వన్ స్ఠానానికి చేరుకొన్నది.

గ్లామర్‌గా అనుష్కశర్మ, కత్రినా కైఫ్
రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తు్న జీరో సినిమాకు గౌరీఖాన్ నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్లు అనుష్క శర్మ, కత్రినా కైఫ్ గ్లామర్‌ను పండించబోతున్నారు.


Click it and Unblock the Notifications











