twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అను బేబీని ఆటపట్టించిన 'శైలజారెడ్డి అల్లుడు' (వీడియో)

    By Rajababu
    |

    అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధానపాత్రలో నటిస్తుండగా ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాతలు నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ నిర్మిస్తున్న 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం నిర్మాణం పూర్తయింది. ఈ నెల 31 న చిత్రం విడుదల కానుంది.

    ఈ చిత్రం తొలి గీతం 'అను బేబీ' ఈరోజు ఉదయం 10 గంటలకు ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ ద్వారా విడుదలయింది. ఈ గీతాన్ని కృష్ణకాంత్ రచించగా, అనుదీప్ దేవ్ పాడారు. శేఖర్ వి.జె. నృత్య దర్శకత్వం వహించారు. ఆడియో విడుదల తేదీ, ఇతర వివరాలు త్వరలోనే తెలియపరుస్తామని చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు.

    Shailaja Reddy Alludu: Anu Baby Video Song

    దాసరి అరుణ్ కుమార్, గిరిబాబు, నరేష్, మురళీశర్మ, వెన్నెల కిషోర్, రఘుబాబు, పృథ్వి, మధునందన్, శత్రు, కల్యాణి నటరాజన్ తదితరులు నటిస్తున్నారు.

    సంగీతం: గోపి సుందర్,పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి,శ్రీమణి,కాసర్ల శ్యామ్,కృష్ణ కాంత్, కెమెరా: నిజార్ షఫీ, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఫైట్స్: వెంకట్ - దిలీప్ సుబ్బరామన్, నిర్మాతలు: నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్, సమర్పణ: ఎస్.రాధాకృష్ణ (చినబాబు), రచన-దర్శకత్వం: మారుతి

    English summary
    Shailaja Reddy Alludu starring Naga Chaitanya, Ramya Krishnan & Anu Emmanuel, Directed by Maruthi has completed its entire Shoot (except one song) and gearing up for August 31st Release. The film is produced by Naga Vamsi S & PDV Prasad under Sithara Entertainments, Presented by S. Radha Krishna(Chinababu).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X