పోరడు నలిగిపోతుండే.. హల్వా అవుతుండే.. శైలజారెడ్డి పాట రిలీజ్
మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాతలు నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ నిర్మిస్తున్న 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం నిర్మాణం పూర్తయింది. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధానపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాటను ఆగస్టు 17వ తేదీన విడుదల చేశారు.
ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో యాంకర్‌గా సుపరిచితులైన సత్యవతి అలియాస్ మంగ్లీ పాడిన జుమ్ జుమ్ జుమ్ బల్ బరి జాతర చూడే.. బంచిక బమ్ బలిపోతయ్యాడే.. ప్రేమ, పంతం నడమన వీడే నలిగిపోతుండే.. ఈ పోరడు హల్వా అయిపోతుండే అనే లిరికల్ పాటను విడుదల చేశారు.

మాస్ బీట్‌తో సాగిన ఈ పాట హుషారెత్తించే విధంగా ఉంది. మాస్ పాటను గోపి సుందర్ స్వరపరచారు. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు.
ఈ చిత్రంలో దాసరి అరుణ్ కుమార్, గిరిబాబు, నరేష్, మురళీశర్మ, వెన్నెల కిషోర్, రఘుబాబు, పృథ్వి, మధునందన్, శత్రు, కల్యాణి నటరాజన్ తదితరులు నటిస్తున్నారు.
సంగీతం: గోపి సుందర్,పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి,శ్రీమణి,కాసర్ల శ్యామ్,కృష్ణ కాంత్, కెమెరా: నిజార్ షఫీ, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఫైట్స్: వెంకట్ - దిలీప్ సుబ్బరామన్, నిర్మాతలు: నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్, సమర్పణ: ఎస్.రాధాకృష్ణ (చినబాబు), రచన-దర్శకత్వం: మారుతి


Click it and Unblock the Notifications











