Don't Miss!
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
శర్వానంద్ 'లైఫ్ ఆఫ్ రామ్' .. యూ ట్యూబ్ లో న్యూ రికార్డ్
కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికి ఓటీటీ వరల్డ్ లో బాగానే హిట్టవుతున్నాయి. ఇక సాంగ్స్ అయితే సినిమాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఒక సినిమాకు బజ్ రావాలి అంటే ముందుగా సాంగ్స్ హిట్టయితేనే జనాలు థియేటర్స్ వరకు వస్తున్నారు. ఇమా శర్వానంద్ నటించిన జాను సినిమాలోని ఒక సాంగ్ కూడా యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డును అందుకుంది.
పూలతో అందాలను దాచేస్తున్న జక్వాలిన్ ఫెర్నాండెజ్
శర్వానంద్ - సమంత జంటగా నటించిన ఈ సినిమా తమిళ్ మూవీ 96 సినిమాకు రీమేక్ గా వచ్చిన విషయం తెలిసిందే. సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. అయితే పాటలు మాత్రం జనాలను అమితంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా లైఫ్ ఆఫ్ రామ్ వీడియో సాంగ్ యూ ట్యూబ్ లో ఏకంగా 100మిలియన్ల వ్యూవ్స్ అందుకోవడం విశేషం.
సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఆ పాటలోని లిరిక్స్ అన్ని వర్గాల వారికి ఎంతగానో కనెక్ట్ అయ్యింది. ఒక మనిషి తనకు ఇష్టమైన ప్రొఫెషన్ లో కొనసాగితే ఎంత ఆనందపడుతూ జీవితాన్ని కొనసాగిస్తాడో ఆ పాటలో మనసుకు హత్తుకునేలా వివరించారు. ఇక ప్రదీప్ కుమార్ గానం. గోవింద్ వసంత మ్యూజిక్ కూడా పాటకు ప్రాణం పోశాయి. ప్రస్తుతం 100మిలియన్ల వ్యూవ్స్ అందుకోవడంతో లైఫ్ ఆఫ్ రామ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.