బుట్టబొమ్మ ఫీవర్ మామూలుగా లేదే.. అక్కడికి కూడా పాకేసింది
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల మాయాజాలమే అల వైకుంఠపురములో. ఈ సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా.. కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడం లేదు.. క్రేజూ తగ్గడం లేదు. రోజురోజుకీ అల వైకుంఠపురుములో ఫీవర్ ఎక్కువవుతూనే ఉంది. సినిమా అంతా ఎక్కెత్తు అయితే.. తమన్ అందించిన సంగీతం మరో ఎత్తు. 'అల'పై ఇంతటి హైప్ క్రియేట్ కావడానికి, ఇండస్ట్రీ హిట్‌గా నిలవడానికి తమన్ మ్యూజిక్కే ఓ కారణం.

సోషల్ మీడియా సెన్సేషన్..
అల వైకుంఠపురములో పాటలతో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు తమన్. సామజవరగమన అంటూ మొదలు పెట్టిన తమన్.. రాములో రాముల, ఓ మై గాడ్ డ్యాడీ, బుట్టబొమ్మ, అల వైకుంఠపురములో, సిత్తరాల సిరపడు ఇలా ఒక్కో పాటతో యూట్యూబ్‌ను షేక్ చేసేశాడు.

టిక్‌టాక్‌లో క్రేజ్..
ఈ మధ్య టిక్ టాక్‌లో జనాలు ఏ రేంజ్‌లో పిచ్చెక్కిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టిక్ టాక్ వల్ల ఎంతో మంది ఫేమస్ అయ్యారు.. సెలెబ్రిటీ స్టేటస్ కూడా వచ్చేసింది కొంతమందికి. సెన్సేషన్ అయిన పాటలకు టిక్ టాక్‌లో వీడియోలు చేసి మరింత పాపులర్ చేస్తుంటారు. ఇప్పడు టిక్ టాక్‌కు బుట్టబొమ్మ ఫీవర్ పట్టుకుంది.

బన్నీ, పూజా స్టెప్పులు వైరల్..
బుట్టబొమ్మ పాట ఎంతగా ఫేమస్ అయిందో.. అందులో బన్నీ గ్రేస్‌తో వేసిన స్టెప్పులు అంతకంటే ఎక్కువగా ఫేమస్ అయ్యాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ ట్రాక్ వరకు బన్నీ, పూజా హెగ్డే వేసే సిగ్నేచర్ స్టెప్పుల అందరికీ బాగా ఎక్కేశాయి. ఈ పాటకు టిక్ టాక్‌లో లెక్కకు మించిన వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి.
తాజాగా శిల్పాశెట్టి..
బాలీవుడ్ భామ శిల్పా శెట్టి.. ఆమె సోదరి పిలిస్తే పలుకుతా ఫేమ్ షమితా శెట్టి ఇద్దరూ బుట్టబొమ్మ స్టెప్పులేశారు. వీటికి సంబంధించిన టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. మన బుట్టబొమ్మ స్టెప్పులు బాలీవుడ్‌ను తాకాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.


Click it and Unblock the Notifications











