లండన్‌లో శృతిహాసన్ కేక.. ప్రియుడు లేకుండానే..

అందాల తార శృతిహాసన్ తన కెరీర్ మంచి ఊపులో ఉండగానే దానిని పక్కన పెట్టడం అందర్ని షాక్‌కు గురిచేసింది. అయితే యాక్టింగ్‌ నుంచి తప్పుకొని గాయనిగా విదేశీ రాక్ బ్యాండ్‌లో తనదైన ముద్రను వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా ప్రియుడు మైఖేల్ కోర్సలే‌తో కలిసి లండన్‌లో ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వడం కూడా దానికి బలంగా మారింది. అయితే తాజాగా మరోసారి శృతిహాసన్ లండన్ వీధులను తన పాటలతో ఊర్రూతలూగించింది. వివరాల్లోకి వెళితే..

ప్రియుడితో తెగతెంపులు

ప్రియుడితో తెగతెంపులు

గత కొద్దికాలంగా శృతిహాసన్ లండన్ రాక్‌‌స్టార్ మైఖేల్ కోర్సలేతో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తల మధ్య మీడియాకు అనూహ్యంగా షాకిచ్చారు. మైఖేల్‌తో రిలేషన్‌కు గుడ్ బై చెప్పినట్టు శృతి ప్రకటించడం సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

ప్రియుడు లేకుండానే తొలిసారి

ప్రియుడు మైఖేల్‌తో విడిపోయిన తర్వాత మళ్లీ లండన్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో తన గాన కచేరిని నిర్వహించింది. ఈ సందర్బంగా తన సింగింగ్ టాలెంట్‌తో లండన్ వాసులను ఉర్రూతలూగించిందంట. శృతి పాడిన పాటలకు సంగీతాభిమానులు ఫిదా అవ్వడమే కాకుండా ప్రశంసలు కురిపించారు అని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

 విజయ్ సేతుపతితో కలిసి

విజయ్ సేతుపతితో కలిసి

ఇక శృతి హాసన్ యాక్టింగ్ కెరీర్ విషయానికి వస్తే, ఆమె చేతిలో పెద్దగా ప్రాజెక్టులు లేవు. తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి లాబ్బమ్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రానికి ఎస్పీ జననాథన్ దర్శకుడు. ఈ చిత్రంలో జగపతిబాబు, హరీష్ ఉత్తమన్, కలైర్సన్ తదితరులు నటిస్తున్నారు.

కమల్‌ హాసన్‌తో కలిసి

కమల్‌ హాసన్‌తో కలిసి

ఇక తండ్రితో కలిసి శభాష్ నాయుడు అనే చిత్రంలో నటించింది. అయితే ఆ సినిమా నిరవధికంగా వాయిదా పడింది. ప్రస్తుతం కమల్ హాసన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్ మూలన పడ్డింది. ఎన్నికల తర్వాత శభాష్ నాయుడు చిత్రాన్ని పట్టాలెక్కిస్తానని కమల్ వెల్లడించడంతో మళ్లీ ఆ సినిమాపై ఆశలు చిగురించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X