‘ఒరేయ్ బుజ్జిగా’ కోసం సిధ్ శ్రీరామ్.. ఈ మాయ పేరేమిటో అంటూ మరో చార్ట్ బస్టర్
సిధ్ శ్రీరామ్.. ఈ మధ్య తెలుగు నాట ఎక్కువగా వినిపిస్తోన్న పేరు. పాట ఏదైనా సరే తన గాత్రంతో అందంగా మలిచేస్తున్నాడు సిధ్ శ్రీరామ్. అపట్లో వచ్చిన ఇంకేం ఇంకేం, మాటే వినదుగా, ఉండిపోరాదే పాటలతో యూత్‌ను ఫిదా చేసిన సిధ్.. రీసెంట్‌గా సామజవరగమనతో అందర్నీ కట్టిపడేశాడు. తాజాగా మగువా మగువా అంటూ మరోసారి మెస్మరైజ్ చేసేశాడు.
అయితే మరోసారి ప్రేమికులను తన గాత్రంతో కట్టిపడేసుందుకు సిద్దమైనట్టు కనిపిస్తోంది. రాజ్ తరుణ్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రం ఒరేయ్ బుజ్జిగా నుంచి సిధ్ పాడిన పాట టీజర్‌ను రిలీజ్ చేశారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలోని ఓ చక్కటి మెలోడిని సిధ్ ఆలపించాడు.

ఈ మాయ పేరేమిటో అంటూ సాగే ఈ పాట టీజర్‌ను కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ పాటను దర్శకుడు సురేందర్ రెడ్డి చేతుల మీదుగా మార్చి 12న మధ్యాహ్నం 3.15 గంటలకు విడుదల చేయించబోతోన్నట్లు ప్రకటించారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్‌పై నిర్మిస్తున్న ఈ మూవీకి విజయ్ కుమార్ కొండ దర్శకత్వం వహిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











