హీరోగా సిద్ శ్రీరామ్ కొత్త అవతారం.. బిగ్ డైరెక్టర్ బంపర్ ఆఫర్?
ఇటీవల కాలంలో ప్రముఖ సింగర్స్ లో భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటున్న వారిలో సిద్ శ్రీరామ్ టాప్ లిస్టులో ఉన్నాడు అని చెప్పాలి. అతను ఏ బాషలో పాట పాడిన కూడా దాదాపు అన్ని భాషల్లోనూ ఆ పాటకు మంచి గుర్తింపు లభిస్తుంది. సినిమాలో సిద్ శ్రీరామ్ పాట ఉంటే సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అవితుంది అనే విధంగా పాజిటివ్ వైబ్రేషన్స్ తో ఒక ఫార్ములా కొనసాగింది. అయితే ఇప్పుడు ఈ స్టార్ సింగర్ వెండితెరపై కూడా కనిపించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక స్టార్ దర్శకుడితో ప్రాజెక్ట్ సెట్ చేసుకునే పనిలో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.

ఆ పాట నుంచి..
సిద్ శ్రీరామ్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటున్నాడు. అతనితో సినిమాలో ఒక్క పాట పాడించినా కూడా సినిమాకు ప్రత్యేకంగా మంచి ప్రమోషన్ వచ్చినట్లే అని అనుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఐ సినిమాలో నువ్వుంటే నా జతగా పాట నుంచి సిద్ శ్రీరామ్ కు మంచి గుర్తింపు లభించింది.

ట్యూన్ నచ్చితేనే..
కేవలం సిద్ శ్రీరామ్ పాటలతోనే కొన్ని సినిమాలకు భారీ స్థాయిలో క్రేజ్ వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమాలో నీలి నీలి ఆకాశం ఏ స్థాయిలో హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక చిన్న సినిమాలకు కూడా అతని గాత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే సిద్ శ్రీరామ్ కేవలం పెద్ద సినిమాలను మాత్రమే చేయకుండా ట్యూన్ నచ్చితేనే.. పాట యొక్క సందర్భం నచ్చితేనే పాడటానికి ఒప్పుకుంటున్నాడు. అతనికి ఒక పాట నచ్చకపోతే ఆ సినిమా ఎంత పెద్దదైనా సరే రిజెక్ట్ చేస్తున్నారట.

హయ్యెస్ట్ రెమ్యునరేషన్..
ప్రస్తుతం సంగీత ప్రపంచంలో అత్యధిక స్థాయిలో పారితోషికం అందుకుంటున్న సింగర్స్ లో కూడా సిద్ శ్రీరామ్ టాప్ లిస్టు లో ఉన్నాడు అని చెప్పాలి.. అతను ఒక్కో పాటకు నాలుగు లక్షల నుంచి 5 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు గా ఇండస్ట్రీలో ఒక టాక్ నడుస్తోంది.. అంతే కాకుండా ముందుగా మ్యూజిక్ నచ్చితేనె శ్రీరామ్ పాటలు పాడడానికి ఒప్పుకుంటున్నాడు.

రెహమాన్ కంపోజింగ్ లో..
సిద్ శ్రీరామ్ మొదట మణిరత్నం కడలి సినిమా ద్వారా గాయకుడిగా పరిచయమయ్యాడు. ఐ సినిమాలో నువ్వుంటే నా జతగా పాటతో ఎక్కువగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత తెలుగు లో గీత గోవిందం లో అతని పాటలు చాలా మంచి క్రేజ్ ను అందించాయి. ఎక్కువగా రెహమాన్ కంపోజిషన్ లోనే సిద్ శ్రీరామ్ డిఫరెంట్ గా పాటలు పాడాడు.
Recommended Video

హీరోగా సిద్ శ్రీరామ్?
అయితే త్వరలోనే సిద్ శ్రీ రామ్ హీరోగా వెండితెరపై కనిపించబోతున్న ట్లు తెలుస్తోంది. ఇక అతని సినిమాను డైరెక్ట్ చేయబోయేది మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ దర్శకుడు మణిరత్నం. అతను రాసుకున్న అందమైన ప్రేమకథలో సిద్ శ్రీరామ్ సింగర్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











