నల్లమల్ల కోసం సిద్ధ్ శ్రీరామ్.. మొదటిసారిగా అలా జానపద పాట!
ప్రస్తుతం సౌత్ ఇండియాలో సిధ్ శ్రీరామ్ హవా నడుస్తోంది. ఆయన పాడిన ప్రతీ పాట ఓ సెన్సేషన్ అవుతోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది. సిధ్ శ్రీరామ్ పాట పాడాడంటే చాలు సినిమాపై హైప్ అమాంతం పెరుగుతోంది. సంగీత ప్రపంచంలో సిధ్ శ్రీరామ్ ఇప్పుడు దూసుకుపోతోన్నాడు. అయితే ఇప్పుడు సిధ్ శ్రీరామ్ మొదటిసారిగా ఓ జానపద పాటను ఆలపించాడు.
భారతీయ సంగీతంతో పాటు పాప్ మ్యూజిక్ లోనూ ప్రవేశం ఉన్న సిధ్ శ్రీరామ్ ఫస్ట్ టైమ్ ఓ ఫోక్ సాంగ్ పాడాడు. 'నల్లమల'చిత్రంలో 'ఏమున్నావే పిల్లా ఏమున్నావే.. అందంతో
బంధించావే'' అంటూ సాగే అందమైన జానపదాన్ని అంతే అందంగా ఆలపించి ఆశ్చర్యపరిచాడు. 'పి.ఆర్'సంగీతం అందిస్తూ తనే రాసిన పాట ఇది. సంగీతంతో పాటు సాహిత్యం కూడా అచ్చమైన జానపదాన్ని తలపించేలా ఉంది.

ఇక మెలోడీ సాంగ్స్ లో సిధ్ శ్రీరామ్ స్వరం ఎంత గొప్పగా అనిపించిందో ఈ జానపద గీతంలోనూ అంతే గొప్పగా ఉంది. మనకు ఫోక్ సాంగ్ అనగానే కొన్ని ప్రత్యేకమైన స్వరాలు
గుర్తొస్తాయి. అలాంటి వారికి మించిన స్థాయిలో తనదైన శైలి గానంతో అలరించాడు సిధ్ శ్రీరామ్. నల్లమల అటవీ ప్రాంతంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనల చుట్టూ అల్లుకున్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ఛత్రపతి శేఖర్, ఛలాకీ చంటి, ముక్కు అవినాశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











